త్వరలో వీరిని కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకున్న కేతువు
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నవగ్రహాలలో రాహు కేతువులను చెడు చేసే గ్రహాలుగా, పాప గ్రహాలుగా చెబుతారు. కానీ వివిధ జాతకుల జీవితాలలో రాహు కేతువులు కూడా శుభాలను చేకూరుస్తారు . త్వరలో సింహరాశిలో కేతువు సంచారం చేయబోతున్నాడు. మే 18వ తేదీన కేతువు సింహరాశిలోకి సంచారం చేసి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు.
కేతువు రాశి మార్పు
ఇక కేతువు రాశి మార్పుతో ప్రయోజనాలను పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం. కేతువు రాశి మార్పుతో వృషభ రాశి, తులా రాశి, కర్కాటక రాశి జాతకులకు లబ్ది జరుగుతుంది. ఈ రాశులవారికి ఆర్ధిక ప్రయోజనాలు చేకూరుతాయి. అన్ని విధాలా కేతు సంచారం వీరికి లాభిస్తుంది. అయితే ఇది ఆయా రాశులలో కేతు సంచారాన్ని బట్టి ఉంటుంది.

వృషభ రాశి
2025 సంవత్సరంలో కేతువు రాశి మార్పు వృషభ రాశి వారికి అనేక ప్రయోజనాలను తీసుకువస్తుంది. వృషభ రాశి జాతకులు ధన లాభంతో పాటు, నూతన వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి కెరీర్ లో పురోగతి ఉంటుంది. కేతువు రాశి మార్పు వీరికి అన్ని విధాలుగా లాభాలు చేకూరుస్తుంది.
తులారాశి
కేతువు రాశి మార్పు తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ స్కీముల నుండి, ఇన్వెస్ట్మెంట్ ల నుండి లాభాలు వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇది తులా రాశి వారికి సానుకూల ఫలితాలను ఇచ్చే సమయం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు కేతువు రాశి మార్పు అన్ని విధాలా కలిసి వస్తుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. వచ్చే ఏడాదిన్నర కాలం ఆర్థిక లాభంతో పాటు, ఉద్యోగంలో పురోగతిని చూస్తారు. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వర్తక, వ్యాపారాలలో లాభాలు వస్తాయి. జీవితం కూడా సానుకూలంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications