మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. జ్యోతిషశాస్త్రంలో కేతువును పాప గ్రహంగా చెబుతారు. చెడు చేసే గ్రహమైన కేతువు 18 నెలలకు ఒకసారి ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. అటువంటి కేతువు నక్షత్రాలలోకి కూడా సంచారం చేస్తూ ఉంటాడు.
మఖా నక్షత్రంలోకి కేతువు
మార్చి 29వ తేదీన కేతువు మఖా నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. మార్చి 29వ తేదీన ఉదయం 4 గంటల 49 నిమిషాలకు ఈ సంచారం జరుగుతుంది. మఖా నక్షత్రంలో కేతువు సంచారం ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ వరకు కొనసాగుతుంది. మఖా నక్షత్రంలో కేతువు సంచారంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మకర రాశి
మకర రాశి జాతకులకు కేతువు సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. విశేషమైన లాభాలను చేకూరుస్తుంది. కేతువు మకర రాశిలో 8వ గృహంలో నక్షత్ర సంచారం చేయడం వల్ల వీరు ఏ రంగంలోనైనా విజయాలను సాధించే అవకాశం ఉంది. జీవితంలో వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ధర్మ మరియు ఆధ్యాత్మిక మార్గంలోనూ వెళ్లే అవకాశం ఉంటుంది. రీసెర్చ్, డేటా అనాలసిస్, ఆడిటింగ్ వంటి రంగాలలో ఉన్న వారికి కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి
కేతువు నక్షత్ర సంచారం వృశ్చికరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. వృశ్చికరాశిలో దశమ స్థానంలో కేతువు సంచారం జరగడం వల్ల ఉద్యోగ వ్యాపారాలలో వీరికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో కష్టాలన్నీ దూరమై సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికస్థితి మెరుగు పడుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అప్పులబాధలు తీరుతాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు కేతువు నక్షత్ర సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ధనస్సు రాశిలో 9వ గృహంలో కేతువు గోచారం జరగడం వల్ల మీకు సంపద అభివృద్ధి జరుగుతుంది. ఆధ్యాత్మిక భావనలు కలిగి పుణ్యక్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదల వృద్ధి జరుగుతుంది. .వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. ఇది అన్ని విధాల ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications