మేనెలలో ఈ రాశులవారిని కుబేరులను చేస్తానని మాటిచ్చిన కేతువు!

వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నవగ్రహాలలో కేతువు ఒక అశుభగ్రహంగాను, కీడు చేసే గ్రహం గానూ భావిస్తారు. కేతువు ప్రతి 18 నెలలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహమైన కేతువు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడు మొత్తం 12 రాశుల వారు ప్రభావితం అవుతారు.

కేతు సంచారం
2023 అక్టోబర్ నెలలో కేతువు కన్య రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు 2025 మే నెలలో 18వ తేదీన కేతువు తన రాశిని మార్చుకుంటున్నాడు. కేతువు సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు సింహరాశిలో సంచారం చేయడం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశుల వారు కేతు సంచారంతో లబ్ధిని పొందుతారు. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

Ketu transits in leo on may 18th these zodiac signs will be rich and lucky

మిధున రాశి
మిధున రాశి వారికి కేతు సంచారం కలిసొస్తుంది. మిధున రాశిలో కేతువు మూడవ ఇంట్లోకి మారుతున్నాడు. దీనివల్ల మిథున రాశి వారి జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. చేసే పనులన్నీ విజయాన్ని సాధిస్తాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న కోరికలన్నీ తీరుతాయి. ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి

తులారాశి
తులారాశి లో కేతువు 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఇది తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. చిరకాల కోరికలు తీరుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధ్యమవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి
మీనరాశిలో 6వ ఇంట్లో కేతువు సంచారం జరుగుతుంది. 2025 మే నుండి మీన రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి సమస్యలు తగ్గి పురోగతి సాధ్యమవుతుంది. పని చేసే చోట పదోన్నతి లభిస్తుంది. వేతన పెంపుకు కూడా అవకాశం ఉంది. నూతన ఆస్తి సంబంధ విషయాలలో పురోగతి సాధిస్తారు. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. పొదుపు పెరుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+