2026లో వీరికి కుబేర కటాక్షం అనిగ్రహించిన కేతువు!
కేతువును నీడ గ్రహంగా, చెడు చేసే గ్రహంగా చెబుతారు. ఎవరి జాతకంలో అయితే కేతువు నీచ స్థానంలో ఉంటాడో వారు పడరాని కష్టాలను పడాల్సి వస్తుంది. అయితే చెడు చేసే గ్రహంగా భావించే కేతువు కొన్ని సందర్భాలలో కొన్ని రాశుల వారికి మంచి కూడా చేస్తాడు.
2026లో కేతువు సంచారం
2026 సంవత్సరంలో కేతువు సింహరాశిలో 11 నెలల పాటు సంచారం చేస్తాడు. 2025 మే 18వ తేదీన కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు. 2026 డిసెంబర్ వరకు కేతువు ఇదే రాశిలో కొనసాగుతాడు. ఇక 2026 సంవత్సరంలో కేతువు సంచారంతో శుభాలు జరిగే ఆ రాశులు ఏమిటి అనేది తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి కేతువు సంచారం శుభ ఫలితాలను తీసుకు రాబోతుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు సంతోషంగా ఉంటారు. పూర్వీకుల నుండి ఆస్తి పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఇది శుభ సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు.
మిధున రాశి
2026 సంవత్సరంలో కేతువు సంచారం కారణంగా మిధున రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మిధున రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. జీవనయానం ప్రశాంతంగా సాగుతుంది. మతపరమైన కార్యక్రమాలలో ఆసక్తితో ఉంటారు. ఈ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవనం గడుపుతారు. భౌతిక సదుపాయాలను అనుభవిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కేతువు సంచారంతో కలిసి వస్తుంది. ఇది వృశ్చిక రాశి వారికి శుభ సమయం. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబ సభ్యుల సపోర్టు ఉంటుంది. కెరీర్ లో ఊహించని లాభాలు పొందుతారు. వైవాహిక జీవితంలో అపార్ధాలు రాకుండా చూసుకుంటే మంచిది. ఇది వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా అన్ని విధాల శుభ సమయం.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications