మీ ఇంట్లో ఉండే అటకలు, మచ్చులు వాస్తు ప్రకారం ఎటువైపు ఉన్నాయో పరిశీలించండి
వాస్తు ప్రకారం నిర్మించుకునే ఇంట్లో అందరూ పాత సామాన్లు పెట్టుకోవడానికి కొన్ని గదుల్లో మచ్చుల్లాంటివి పైన నిర్మించుకుంటారు. కొందరు వాటిని అటకలు అంటారు. అయితే వాటికి కూడా వాస్తు ఉంటుంది. కొందరు ఏ దిక్కులో పడితే ఆ దిక్కులో కట్టేస్తుంటారు. కానీ వాస్తు నిపుణులను సంప్రదించి మాత్రమే వాటిని నిర్మించాలి. ఎందుకంటే అవి బరువుంటాయి కాబట్టి. అటకలు ఏ దిక్కులో ఉంటే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంట్లో కిచెన్ లో, బెడ్ రూంలో, తూర్పులో ఉండటం మంచిది కాదు.
ఉంటే వాటిని తొలగించాలి.
నైరుతి దిక్కులో ఉండటంవల్ల ఎటువంటి దోషం ఉండదు.
ఏ గదిలో అయినా తూర్పు, ఉత్తర దిక్కుల్లో అటకలు ఉండకూడదు.
పడమర, దక్షిణం దిక్కుల్లో మాత్రమే ఉండాలి.

నైరుతి దిశలో అటకలు ఉంటే యజమానికి ఆర్థికంగా కలిసివస్తుంది.
దక్షిణం, పడమరవైపు ఉంటే అవి వాస్తు రీత్యా చాలా మంచిది.
ఈశాన్యంలో బరువైన సామాన్లు ఉంటే మానసికంగా ప్రశాంతత ఉండదు.
అటకలు గాలి, వెలుతురును అడ్డుకోకూడదు.
ఒకవేళ కచ్చితంగా వీటిని నిర్మించుకోవాలి అని మీరు అనుకుంటే
దక్షిణం, పడమర దిక్కుల్లోనే కట్టుకోండి.
ఒకవేళ తూర్పు, ఉత్తరంలో అటకలుంటే అక్కడ తేలికపాటి వస్తువులే పెట్టండి.
అటకలపై చెత్తాచెదారం లేకుండా చూసుకోండి.
విరిగిపోయిన, చిరిగిపోయిన, పాత వస్తువులు ఉండటంవల్ల ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.
అటక కింద నిద్ర పోకూడదు.
దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్యం కలుగుతుంది.
అటక కింద పని కూడా చేయకూడదు.
ఒకవేళ పనిచేయాలనుకుంటే తెల్లటి రంగును అటకకు వేయాలి.












Click it and Unblock the Notifications