డిసెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు; హిందూ పండుగలు!!
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ నెలకు తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఏ మాసానికి ఆ మాసానిదే విశిష్టత ఉంటుంది. అలాగే డిసెంబర్ నెలకొక ప్రత్యేకమైన స్థానం ఉంది. డిసెంబర్ నెలలో ముఖ్యమైన హిందువులు జరుపుకునే పండుగలు, అలాగే తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను ఇక్కడ తెలుసుకుందాం.
డిసెంబర్ నెలలో వచ్చే పండుగల విషయానికి వస్తే డిసెంబర్ 8వ తేదీన సర్వ ఏకాదశి డిసెంబర్ 11వ తేదీన మాస శివరాత్రి, డిసెంబర్ 16వ తేదీన ధనుష్ సంక్రాంతి, డిసెంబర్ 17వ తేదీన ధనుర్మాసం ప్రారంభం కానుంది. అదే రోజు తిరుప్పావై పఠనం ప్రారంభం కానుంది. డిసెంబర్ 18వ తేదీన సుబ్రహ్మణ్య షష్టి నిర్వహించనుండగా,డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి నిర్వహించనున్నారు.

డిసెంబర్ 26వ తేదీన దత్తాత్రేయ జయంతి ఉండగా, డిసెంబర్ 30తేదీన సంకటహర చతుర్థి పండుగలు హిందువులు అత్యంత ప్రధానంగా జరుపుకోనున్నారు.ఇదిలా ఉంటే డిసెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను కూడా ప్రస్తుతం మనం తెలుసుకుందాం. డిసెంబర్ మూడవ తేదీన తిరుమలలో పార్వేట మండపంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.
డిసెంబర్ 8వ తేదీన సర్వ ఏకాదశి కాగా, డిసెంబర్ 12వ తేదీన అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమలలో డిసెంబర్ 17వ తేదీన ధనుర్మాసాన్ని ప్రారంభించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న శాత్తుమొర నిర్వహించనున్నారు.
డిసెంబర్ 23వ తేదీన వైకుంఠ ఏకాదశి కాగా, శ్రీవారి ఆలయంలో విశేషంగా వైకుంఠ ద్వార దర్శన ప్రారంభం నిర్వహించనున్నారు. అంతేకాదు ఆరోజు స్వర్ణ రథోత్సవం నిర్వహించి శ్రీవారిని ఊరేగించనున్నారు. డిసెంబర్ 24వ తేదీన వైకుంఠ ద్వాదశి నాడు శ్రీవారికి చక్రస్నానం నిర్వహించి శ్రీ స్వామివారి పుష్కరిణి తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నారు. డిసెంబర్ 28వ తేదీన శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications