Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తులారాశి ( Libra) వారికి 2022 - 2023 శ్రీ శుభకృత్ నామ సం.ర ఉగాది వార్షిక ఫలితాలు

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు.. మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య

తులారాశి ( Libra)చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారు తులారాశికి చెందుతారు.

తులారాశి వారికి శుభకృత్ నామ సంవత్సరంలో

ఆదాయం - 8, వ్యయం - 8 సమానంగా ఉంటుంది.

రాజపూజ్యం - 7, అవమానం - 5 .

Know the Ugadi annual results for those who bear Libra as Zodiac sign

* గురుగ్రహ ఫలితాలు :- సంవత్సర ప్రారంభం నుండి పంచమ భావంలో సంచారం వలన బంధు మిత్రుల సంపదలచే విలాసం చేస్తారు. శుభాకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 7 ఏప్రిల్ 2022 నుండి షష్టమ భావ సంచారం వలన వృత్తి, వ్యాపార కొరకు ఋణాలు చేస్తారు. అనారోగ్య సమస్యల వలన అధిక ఖర్చులు ఏర్పడతాయి. వాహనాలను లేదా గృహాలను మర్మత్తు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడే సూచనలున్నాయి. స్వంత ఇంట్లో కాకుండా పరాయి ఇండ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి.

* శని "దేవుని" గ్రహ ఫలితాలు:- 2023 ఫిబ్రవరి వరకు చతుర్ధ స్థాన సంచారం ఆ తర్వాత పంచమ భావంలో సంచారం వలన అవసరాలకు కావలసిన ఆదాయ వనరులు ఉండవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకై వైద్యం ఖర్చులు ఉంటాయి. అప్పు మీద అప్పు చేస్తారు. భోజనానికి నిద్రకు సమయాభావం కరువైతుంది. స్థిరాస్తులు కొనలేకపోతారు. ఇంటి నిర్మాణం వాయిదా పడుతుంది. తనకంటే తక్కువ స్థాయి వారితో మాట పడాల్సిన స్థితి గోచరిస్తుంది. ఈ ఫలితాలు అనేవి మీ జీవిత భాగస్వామి మరియు సంతానానికి సంబంధించిన వారి వారి జాతకాలలోని గోచార స్థితిని బట్టి బలాబలాల ప్రభావం అనేది మీ జాతక ఫలితాలపై హెచ్చు తగ్గులుగా ప్రభావం తప్పకుండా ప్రభావితం చేస్తాయి.

* రాహువు ఫలితాలు:- షష్టమ భావంలో ఉండగా ఆరోగ్యం బాగుండును. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ప్రతి పనిని యుక్తితో పూర్తిచేస్తారు. 15 ఏప్రిల్ 2022 నుండి సప్తమ భావంలో సంచారం వలన మనోవేదన, ప్రయాణాలలో అలసిపోతారు. కాళ్ళకు సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశాలు.

* కేతువు ఫలితాలు:- జన్మ సంచారం వలన కుటుంబంలో విరోధాలు. ఆర్ధిక, ఆరోగ్య లోపములు, మన:శాంతి కరువైతుంది.

గురు గ్రహం ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది విజయాలు లభిస్తాయి.

అర్ధాష్టమ శని 17-01-2023 వరకు ఉంటుంది.

రాహు, కేతు గ్రహాల ప్రభావంతో మిశ్రమ ఫలితాలు.

డబ్బు వస్తుంది కానీ నీటి ప్రవాహంలాగా ఖర్చు పెడతారు.

ఖర్చులు తగ్గించండి.

వచ్చిన డబ్బుతో స్థిరాస్థులు కొంటే మంచిది.

వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది.

ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభిస్తుంది.

వ్యాపార ప్రోత్సాహం కనబడుతుంది.

రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉన్నది, పరిస్థితులను చేజార్చుకోవద్దు.

విద్యార్ధులు కృషికి తగిన ఫలితం పొందుతారు.

Know the Ugadi annual results for those who bear Libra as Zodiac sign

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు దేవాలయ ప్రతిష్టలో పాల్గొనండి. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.. ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+