మీనరాశి ( Pices) వారికి 2022 - 2023 శ్రీ శుభకృత్ నామ సం. ర ఉగాది వార్షిక ఫలితాలు
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు.. మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారు మీనరాశికి చెందుతారు.
మీనరాశి వారికి శుభకృత్ నామ సంవత్సరంలో
ఆదాయం - 2, వ్యయం - 8
రాజపూజ్యం -1, అవమానం -7

మీనరాశి వారికి శుభకృత్ నామ సంవత్సరంలో
* గురుగ్రహ ఫలితాలు :- సంవత్సర ఆరంభం నుండి వ్యవ భావంలో ఉండి 7 ఏప్రిల్ 2022 నుండి జన్మరాశిలో సంచారం చేయును. వృత్తి ఉద్యోగలయందు సమస్యలు ఏర్పడును. ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత అలజడి కలుగుతుంది. అధికారులను ఎదురించి చిక్కులు పడే అవకాశం గోచరిస్తున్నది. మానసిక అశాంతి. శత్రువుల వలన పరువు నష్టం అనవసరమైన ధన వ్యయం కలుగుతుంది.
* శని "దేవుని" గ్రహ ఫలితాలు:- ఫిబ్రవరి 2023 వరకు లాభ స్థానంలో ఉండగా ఫలితాలు కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉండవు. శుభకార్యాలు నిర్వహిస్తారు. డబ్బులు అవసారానికి అందుతాయి. భూములు, గృహం, వాహనం కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2023 నుండి వ్యయ భావంలో సంచారం వలన తెచ్చిన అప్పులు అతి ప్రయాస మీద తీర్చ వలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కొన్ని విషయాలలో మౌనం మీకు మేలు చేస్తుంది. ఈ ఫలితాలు అనేవి మీ జీవిత భాగస్వామి మరియు సంతానానికి సంబంధించిన వారి వారి జాతకాలలోని గోచార స్థితిని బట్టి బలాబలాల ప్రభావం అనేది మీ జాతక ఫలితాలపై హెచ్చు తగ్గులుగా ప్రభావం తప్పకుండా ప్రభావితం చేస్తాయి.
* రాహువు ఫలితాలు:- 15 ఏప్రిల్ 2022 నుండి ద్వితీయ భావంలో ప్రవేశం విదేశీ ప్రయాణములు. ఆరోగ్యం సహకరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.
* కేతువు ఫలితాలు:- 5 ఏప్రిల్ 2022 నుండి అష్టమ భావ సంచారం వలన వృత్తి ఉద్యోగాలలో ప్రతి బంధకములు. అధికార భయలుము. తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
బద్దకం విడితే మంచి లాభాలు వస్తాయి.
యుక్తిని ప్రదర్శించే వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.
అనుకూలవంతమైన ఆరోగ్యమే కానీ బయట ఆహారపుటలవాట్లు మానండి.
శత్రువుల బెడద ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించండి. .
ఆడంబరాలకు వెళ్ళకండి, ఖర్చులు తగ్గించండి.
వ్యవసాయదారులకు పంటలు అనుకూలం. కొంత డబ్బును నిలువ చేస్తారు.
ఉద్యోగులు అధికారుల ఒత్తిడికి గురి అవుతారు.
వ్యాపారస్తులకు ఆదాయం బాగుంటుంది. పన్నులు సరైన కాలంలో కట్టకపోతే ఇబ్బందులు తప్పవు.
రాజకీయనాయకులకు కీర్తి ప్రతిష్టలను పెంచుకుంటారు. అధిష్టానం కరుణించి ఉన్నత పదవులు కట్టబెట్టే సూచనలున్నాయి.
విద్యార్ధులు ఇతరుల సహాయం పొంది ఉత్తీర్ణులు అవుతారు.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు సుదర్శన హోమం జరిపించండి. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.. ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications