వృశ్చికరాశి ( Scorpio) వారికి 2022 - 2023 శ్రీ శుభకృత్ నామ సం. ర ఉగాది వార్షిక ఫలితాలు
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు.. మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారు వృశ్చికరాశికి చెందుతారు.
వృశ్చికరాశి వారికి శుభకృత్ నామ సంవత్సరంలో
ఆదాయం - 14, వ్యయం -14 సమానంగా ఉంటుంది.
రాజపూజ్యం - 03, అవమానం - 01

* గురుగ్రహ ఫలితాలు :- సంవత్సర ప్రారంభం నుండి చతుర్ధ భావంలో సంచారం వలన అప్పులు తెచ్చి పాతబాకీలు తీరుస్తారు. గృహ, వాహన మర్మత్తులు చేస్తారు. అధిక ఖర్చులుంటాయి. 7 ఏప్రిల్ 2022 నుండి పంచమ భావ ప్రవేశం వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతమైన పదవులు, స్థాయి లభిస్తుంది. భూములు, గృహముల కొనుగోలు విషయంలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్ధులు ఉన్నత ఫలితాలు పొందుతారు.
* శని "దేవుని" గ్రహ ఫలితాలు:- 23 ఫిబ్రవరి 2023 వరకు తృతీయ భావంలో సంచారం వలన పెండింగులో ఉన్న పనులనింటిని సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీ సౌఖ్యం పొందుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభసాటిగా కొనసాగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. 24 ఫిబ్రవరి 2023 నుండి చతుర్ధ భావ సంచారం వలన అనారోగ్య సమస్యలు వాత రోగముల వలన ఇబ్బందులు కలుగే సూచనలున్నాయి. ఇంట్లో ఖర్చులు అధికంగా పెరుగుతాయి. వేళ తప్పి భోజనం, నిద్ర వలన అనారోగ్యం బారిన పడే అవకాశాలు మెండుగా గోచరిస్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీ జీవిత భాగస్వామి మరియు సంతానానికి సంబంధించిన వారి వారి జాతకాలలోని గోచార స్థితిని బట్టి బలాబలాల ప్రభావం అనేది మీ జాతక ఫలితాలపై హెచ్చు తగ్గులుగా ప్రభావం తప్పకుండా ప్రభావితం చేస్తాయి.
* రాహువు ఫలితాలు:- 15 ఏప్రిల్ 2022 నుండి షష్టమ భావంలో సంచారం వలన ఆరోగ్యం సహకరిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. విద్యార్ధులకు మంచి అనుకూలమైన కాలం.
* కేతువు ఫలితాలు:- 15 ఏప్రిల్ 2022 నుండి వ్యయ భావ సంచారం వలన అప్పులు పెరుగును. కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలున్నాయి. స్థాన మార్పులేదా శత్రువుల మూలకంగా ఇబ్బందులు కలిగే స్థితి గోచరిస్తుంది.
గురు గ్రహం అనుకూలంగా ఉండటం ఈ రాశి వారికి ఈ ఏడాది శుభ ఫలితాలొస్తాయి.
వివాహితులకు సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.
శని గ్రహం ప్రభావం వల్ల మానసిక ధైర్యం కొద్దిగా తగ్గుతుంది.
రాహువు గ్రహం కారణంగా అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
కేతువు గ్రహం వల్ల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులున్నా.. చివరికొచ్చేసరికి విజయవంతంగా పూర్తవుతాయి.
అనుకూలవంతమైన ఆరోగ్యం.
పట్టిందల్లా బంగారమే కానీ అధిక ఖర్చులు చేస్తారు. ఖర్చులు తగ్గించండి.
వచ్చిన డబ్బుతో స్థిరాస్థులు కొంటే మంచిది.
వ్యవసాయ దారులకు మంచి దిగుబడి ఉంటుంది, కానీ ధనం ఇంటికి రావడం కష్టం.
ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఇక్కట్లు తప్పవు.
నిగ్రహం పనిని ప్రారంభించండి శుభం కలుగుతుంది.
వ్యాపారస్తులకు ఉన్నత స్థితికి చేరుతారు. న్యాయ పరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడాలి.
రాజకీయ నాయకులకు ప్రజా క్షేత్రంలో ఎక్కువ కాలం గడపవలసి వస్తుంది.
విద్యార్ధులు చదువుపై అధిక శ్రద్ధ చూపకపోతే రెండవసారి పరీక్షకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు దేవాలయ ప్రతిష్ట లో పాల్గొనండి. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.. ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications