పూర్వ జన్మ పాపాలు - ప్రస్తుత జన్మ ఖర్మలతో జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, ఖర్మకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం.. ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం. పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్ధంతమే హిందూ మతానికి పునాది కూడా.
* కర్మ సిద్దాంతము ప్రకారం.. జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.

మొత్తానికి "పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం" పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టి ప్రస్తుత జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం మన కర్మ ఫలితాలకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపములోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.
* మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటీ..? వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి. గతజన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు. ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు. కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడమూ ఉన్నదని స్పష్టమవుతోంది.
* జాతక ఆధారంగా కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. జాతక చక్రంలోని నవమ భావం ద్వారా మన పూర్వజన్మకు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చును. పూర్వ జన్మలో మానవులు చేసే పాపాలు, ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేను గత కొన్ని సంవత్సరాలుగా పలువురి జాతకాలను ప్రత్యేక శ్రద్ధతో గతజన్మకు సంబంధించిన విషయాలను జ్యోతిష శాస్త్ర ఆధారంగా జాతక చక్రం వేసి చూసాను, చాలా ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలను గమనించాను. నా పరిశోధనలో తేలిన ఫలితాలను మచ్చకు కొన్నింటిని మీకు తెలియజేస్తున్నాను.
* గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికొదిలేసాడు. ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి, పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.
* గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేసేసాడు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలూ విషాద పరిస్థితుల్లో మరణించారు. వయసు అయిపోతోంది. చేతిలో డబ్బులేదు. ముసలి వయసులో ఫుట్ పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది.
* గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్ళి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్ గా కనిపిస్తున్నది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిసంబంధాలు వచ్చినా ఒక్కటీ కుదరటం లేదు, చాలా బెంగ పడుతుంది. ఈ దోష నివారణకు తగిన పరిహారాలు చేస్తే గాని ఈ దోషం తొలగదు.
* ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుత జన్మ మరియు పూర్వ జన్మ ప్రభావం ఎదుర్కొంట్టున్న వారు చాలా మందే కనిపిస్తారు. ఇంకో విషయం జాగ్రత్తగా గమనించాలి తలిదండ్రులు చేసిన పాప పుణ్య ఫలితాలు కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే మనం నివసిస్తున్న ఇల్లు వాస్తుకు లేకపోయినా చెడు ఫలితాలు విజృంభిస్తాయి. మంచి అనుకూలమైన ఫలితాలు కావాలి అనుకునే వారు వారి జాతక ఆధారంగా సరియైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు తొలగిపోతాయి. అయితే సరియైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది.
* పూర్వ జన్మలో చేసిన పాపలకు.. ప్రక్షాళన ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యల నివారణకు.. ఆ పరమేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాలి, నియమాలు పాటించాల్సి ఉంటుంది. గతంలో చేసిన పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు మొదలైనవన్నీ మనిషికి వ్యాధి వస్తే ఆరోగ్యం బాగుపడాలని వాడే మాత్ర ( ఔషదం ) లాంటిది. గత జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో.. మనలో పుణ్యఫలం పెరుగుతుందో .. గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలై దోషాలు తొలగి సుఖజీవనాన్ని పొందుతారు.
-
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
today rashiphalalu: భూమిని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వాస్తు ప్రకారం ఇంటి గోడల్లో దోషం ఉంటుందా? -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..!












Click it and Unblock the Notifications