today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!
మార్చి 7, 2026 శనివారం గ్రహాల సంచారం అనేక రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు శనిదేవుడితో శుక్రుడి కలయిక మీనరాశిలో బలంగా ఉంటుంది. ఈ రోజువరకు మార్చి 3న ఏర్పడిన చంద్రగ్రహణం ప్రభావం వివిధ రాశులవారిపై ఉంటుంది. మార్చి మొదటి వారంలో బుధుడు కమ్యూనికేషన్, నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. కొన్ని రాశులవారికి కొత్త అవకాశాలు లభిస్తే, మరికొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రాశిఫలాలు చూద్దాం.
మేషం
మేషరాశి వారికి ఈ రోజు పనుల్లో చురుకుదనం కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రయోజనం కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు.

వృషభం
వృషభ రాశి జాతకులకు ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరగే అవకాశముంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
మిథునం
మిధున రాశి జాతకులకు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు రావచ్చు. స్నేహితుల సహకారం లభిస్తుంది.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకులు నేడు కుటుంబ విషయాల్లో శాంతంగా వ్యవహరించడం అవసరం. ఇవ్వాళ పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఖర్చు విషయంలో జాగ్రత్త .
సింహం
సింహరాశి జాతకులకు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. నేడు సింహరాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు రావచ్చు.
కన్య
కన్యా రాశి జాతకులకు పనుల్లో కొంత ఒత్తిడి ఉండొచ్చు. సహచరులతో సహనం పాటించడం అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
తుల
ఈ రోజు తులారాశి జాతకులు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది.
వృశ్చికం
నేడు వృశ్చిక రాశి జాతకులు పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర వాదనలు నివారించడం మంచిది. ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకులకు ప్రయాణాలకు అనుకూల సమయం. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. స్నేహితుల సహాయం లభిస్తుంది.
మకరం
నేడు మకర రాశి వారికి పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా మెల్లగా పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది.
కుంభం
కుంభరాశి జాతకులకు నేడు కొత్త పరిచయాలు కలుగుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం.
మీనం
మీనరాశి జాతకులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మితమైన లాభాలు కనిపిస్తాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications