గణేష్ చతుర్థి నుండి వీరికి ఐశ్వర్యాన్ని ప్రకటించిన వినాయకుడు!
దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ నిర్వహించనున్నారు. విఘ్నేశ్వరుడికి జ్యోతిష్యపరంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రానికి మూలపురుషుడిగా వినాయకుడిని చెబుతారు. అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా కొన్ని రాశుల వారికి విఘ్నేశ్వరుడి కటాక్షం పుష్కలంగా లభిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కర్కాటక రాశి
వినాయక చవితి పండుగ నాడు కర్కాటక రాశి వారికి విఘ్నేశ్వరుడి కటాక్షం పుష్కలంగా లభిస్తుంది. కర్కాటక రాశి జాతకులు ముఖ్యంగా వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వినాయకుడి కృపతో కర్కాటక రాశి వారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఆర్థికంగాను ప్రయోజనాలు చేకూరుతాయి.

కన్యారాశి
కన్యా రాశి వారు వినాయక చవితి నుండి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ రాశి వారికి వినాయక చవితి నుండి అప్పుల బాధలు తీరిపోతాయి. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి వినాయక చవితి సందర్భంగా వీరు శుభవార్తలు వింటారు. కెరీర్ పరంగాను వీరికి కొత్త అవకాశాలు వస్తాయి. కన్యా రాశి జాతకుల కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది.
తుల రాశి
ఈ సంవత్సరం వినాయక చవితి నుండి తులా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. తులారాశి జాతకులు ఆకస్మిక దన లాభాలను పొందుతారు. తులారాశి వారి ఆస్తులు అమాంతం పెరుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు.
మీనరాశి
ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ సందర్భంగా మీన రాశి వారికి చెందినవారు వినాయకుడి కటాక్షాన్ని పొందుతారు. మీరు ఏ పని తలపెట్టినా విఘ్నాలు లేకుండా సజావుగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. మీన రాశి వారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలను వింటారు. సంతానం పురోగతి కనిపిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications