విలాసాలకు అధిపతి శుక్రుడు.. జూన్ 30న ఉదయంతో వీరికి లగ్జరీ లైఫ్ షురూ
సంపదలకు, విలాసాలకు, లగ్జరీకి కారణభూతుడైన శుక్రుడు ప్రస్తుతం మిధున రాశిలో సంచరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 25వ తేదీన శుక్రుడు అస్తంగత్వ దశలోకి వెళ్ళాడు. ఇప్పుడు జూన్ 30వ తేదీన శుక్రుడు ఉదయించబోతున్నాడు. జూలై 7వ తేదీ వరకు శుక్రుడు మిధున రాశిలోనే ఉంటాడు. ఆపై మిధున రాశిని వీడి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.
మిధునరాశి లో శుక్రుడి ఉదయం
ఇక మిధున రాశిలో శుక్రుడు ఉదయించటం వల్ల కొన్ని రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది. మరికొన్ని రాశుల వారు ప్రతికూల ప్రభావాలను చూడాల్సి వస్తుంది. అయితే శుక్రుడు మిధున రాశిలో ఉదయించడం వల్ల లబ్ధి పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
మిధున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వృషభ రాశి జాతకులు ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. ఈ రాశి వారికి ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం కూడా సంతోషదాయకంగా ఉంటుంది.
కన్యా రాశి
మిధున రాశిలో శుక్రుడు ఉదయించడం కారణంగా కన్యా రాశి వారికి కూడా లబ్ధి జరుగుతుంది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి జాతకులకు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. సంపాదనకు నూతన మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది మంచి సమయం.
తులా రాశి
మిధున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల తులా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా తులా రాశి వారు నిలదొక్కుకోవడానికి ఇది మంచి సమయం. వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల, సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. శుక్రుడి ప్రభావంతో కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో మంచి కాన్ఫిడెన్స్ తో తులా రాశి జాతకులు ప్రవర్తిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications