vinayaka chavithi 2025: 365రోజులూ ఈ రాశులవారిపై వినాయకుడి కటాక్షం.. ధన వర్షం!
రేపే వినాయక చవితి. వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ హిందువులు చాలా విశిష్టంగా జరుపుకుంటారు. వాడవాడలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు. ఇక ఆదిదేవుడైన వినాయకుడికి అగ్ర పూజలు చేయడం వల్ల అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.
వినాయకుడికి ఇష్టమైన రాశులు
జ్యోతిష్య శాస్త్రంలో కూడా వినాయకుడికి మంచి స్థానం ఉంది. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, శివుడికి ఏ విధంగా అయితే ఇష్టమైన రాశులు ఉంటాయో, వినాయకుడికి కూడా ఇష్టమైన రాశులు ఉన్నాయి. వీరిపై వినాయకుడు 365 రోజులూ తన కటాక్షం చూపిస్తాడు. ప్రస్తుతం మనం వినాయకుడికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం.

మేష రాశి
మేషరాశి జాతకులు వినాయకుడికి అత్యంత ఇష్టమైనవారు. వీరికి వినాయకుడి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. మేష రాశికి కుజుడు అధిపతి కావడం వల్ల వీరికి ధైర్యసాహసాలు మెండుగా ఉంటాయి. వినాయకుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల ఈ రాశి వారు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. ఎటువంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు ప్రతీరంగంలోనూ తమదైన ముద్ర వేసుకుని దూసుకుపోతాడు.
మిధున రాశి
మిధున రాశి వారిపై వినాయకుడి కటాక్షం కచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు బుధవారం రోజు వినాయకుని పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. మిధున రాశి వారు చాలా తెలివిగలవారు. ప్రతిభ ఉన్నవారు. వీరిపైన వినాయకుడి ఆశీర్వాదం ఉండడం వల్ల వీరు ఏ పని చేసినా సక్సెస్ ఫుల్ గానే పూర్తి చేస్తారు. వినాయకుడి అనుగ్రహంతో వీరికి సమాజంలో మంచి పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. మంచి ఆదాయం కూడా ఉంటుంది.
మకర రాశి
వినాయకుడికి ఇష్టమైన రాశులలో మకర రాశి ఒకటి. మకర రాశికి శనీశ్వరుడు అధిపతి. ఈ రాశి వారిపై కూడా వినాయకుడి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వినాయకుడి ఆశీర్వాదంతో వీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. విద్యారంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనే స్వభావం వీరికి ఉంటుంది. వినాయకుడిని నియమ నిష్ఠలతో పూజించి మంచి పనులు చేసిన వారికి తిరుగులేని ఫలితాలను ఇస్తాడు వినాయకుడు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications