డిసెంబర్ లో వీరికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక డిసెంబర్ మాసంలో గ్రహాలకు రాజు అయిన సూర్యుడు, భూమి కుమారుడైన కుజుడు మధ్య సంయోగం జరగబోతుంది. 2025 డిసెంబర్ మాసంలో జరగనున్న మంగళ ఆదిత్య యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
మంగళాదిత్య యోగం
జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని గౌరవానికి, ప్రతిష్టకు, ఆత్మవిశ్వాసానికి, కారకుడిగా భావిస్తారు. కుజుడిని ధైర్యానికి, శౌర్యానికి, ఆస్తులకు, ధైర్యానికి సూచికగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడే మంగళాదిత్య యోగం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ధనస్సు రాశి
సూర్య కుజ సంయోగంతో ధనుస్సు రాశి జాతకులకు కలిసి వస్తుంది. ధనస్సు రాశిలో సూర్య కుజ సంయోగం మొదటి గృహంలో జరుగుతుంది. అందువల్ల ఈ సమయంలో మీ ధైర్యం శౌర్యం పెరుగుతుంది. విశ్వాసం పెరుగుతుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహ ప్రతిపాదనలు అవివాహితులకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.
మీన రాశి
సూర్య కుజ సంయోగం కారణంగా మీనరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీనరాశిలో సూర్య కుజ కలయిక కర్మస్థానంలో జరుగుతుంది. అందువల్ల మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన విజయాలు వస్తాయి. ఆర్థిక జీవితానికి ఇది అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. సామాజిక మరియు కుటుంబ జీవితం బాగుంటుంది. మీనరాశి వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
తులారాశి
తులారాశిలో మూడవ స్థానంలో సూర్య కుజ సంయోగం జరుగుతుంది. దీని కారణంగా తులా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు చేసే వ్యాపారాల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విదేశీ వ్యాపారం చేసేవారు గణనీయమైన లాభాలను చూస్తారు. సోదరుల, సోదరీమణుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications