lucky colors for zodiac signs: మేషరాశి నుండి కన్యారాశి వరకు.. అదృష్ట రంగులివే!!

జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశి చక్రాలు ఉన్నాయి. ప్రతి రాశి దేనికదే ప్రత్యేకమైనది. ప్రతి రాశికి సంబంధించిన ఒక అదృష్ట రంగు ఉంటుంది. అదృష్ట రంగును ఆ రాశి జాతకులు ధరించినప్పుడు అది వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. జీవితంలో శ్రేయస్సును తీసుకువస్తుంది.

రంగులకు మన జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్యంలో, వాస్తులోనూ రంగులకు ప్రముఖ స్థానం ఉంటుంది. ఇక అటువంటి రంగులు వివిధ రాశుల వారి జీవితాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. మరి మేష రాశి నుండి సింహ రాశి వరకు ఆరు రాశుల వారి అదృష్ట రంగులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Lucky colors for zodiac signs: From Aries to Virgo.. know the Lucky colors!!

రాశి చక్రంలో మొదటి రాశి అయిన మేషరాశి వారికి అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. ఎరుపు రంగు శక్తికి, సంతానోత్పత్తికి, అభివృద్ధికి ప్రతీకగా భావిస్తారు. ఎరుపు రంగు మేష రాశి జాతకులలోని శక్తిని ప్రతిబింబించేలా చేస్తుంది. రాశి చక్రంలో రెండవ రాశి వృషభరాశి. వృషభ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇచ్చే రంగులు తెలుపు మరియు నీలం రంగులు .ఈ రంగులు వృషభరాశి వారి వ్యక్తుల జీవితాల్లో శాంతిని మరియు ప్రశాంతతను తెస్తాయి.

ఇక మిధున రాశి జాతకులకు కలిసి వచ్చే అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు ధరించడం మిధున రాశి జాతకులకు సానుకూలమైన ఆలోచనల పెరుగుదల ఉంటుంది .ఇది వారి మనసు మరియు హృదయంలో సామరస్య భావాన్ని పెంపొందిస్తుంది. వారి భావోద్వేగాల సమతుల్యతను కూడా ఉండేలా చేస్తుంది. జీవితంలో మిధున రాశి వారు బ్యాలెన్స్డ్ గా ఉండేలా చేస్తుంది.

ఇక నాలుగవ రాశి అయిన కర్కాటక రాశి జాతకులకు కలిసొచ్చే రంగు తెలుపు రంగు. తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల కర్కాటక రాశి జాతకులు భావోద్వేగ స్థిరత్వంతో ఉంటారు. ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఇక సింహ రాశి జాతకులకు కలిసొచ్చే రంగులు ముదురు ఎరుపు రంగు, నారింజరంగు, పసుపు రంగు మరియు బంగారు రంగులు. ఈ రంగులు సింహరాశి జాతకులకు విజయ అవకాశాలను ఇస్తాయి.

ఇక కన్యా రాశి జాతకులకు కలిసి వచ్చే అదృష్ట రంగు ఆకుపచ్చ షేడ్స్. ఇవి ఆకుపచ్చ మేధస్సుకు, కరుణకు, సానుకూల మనస్తత్వానికి ప్రతీక. కన్యా రాశి జాతకులకు ఈ రంగులు తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+