లక్ష్మీదేవి జీవితాంతం సంపదలు ఇచ్చే ఈ రాశులవారు లక్కీఫెలోస్!
సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. హిందూమతంలో వారంలోని ఒక రోజును లక్ష్మీదేవికి అంకితం చేసి మరీ పూజలు చేస్తారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కేటాయించి ఆమెను విశేషంగా కొలుస్తారు. లక్ష్మీదేవిని నిజమైన హృదయంతో పూజించేవారికి సంపదల వర్షం కురుస్తుందని నమ్ముతారు.
లక్ష్మీ దేవికి ఇష్టమైన రాశులు
జ్యోతిషశాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన కటాక్షం ఉంటుందని చెబుతారు. వారిని లక్ష్మీ దేవి ఎలాంటి లోటు రాకుండా కంటికి రెప్పలా జీవితాంతం కాపాడుకుంటుంది. మరి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆమె కటాక్షాన్ని పొందే ఆ అదృష్ట రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రాశులలో వృషభరాశి ఒకటి. వృషభరాశి వారిని లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వారిగా చెబుతారు. వృషభరాశిని శుక్రుడు పాలిస్తాడు. సంపదను శ్రేయస్సును సూచించే ఈ రాశి లక్ష్మీదేవికి ఇష్టమైన రాశి. వృషభరాశి వారు కష్టపడి పనిచేస్తారు. ఆచరణాత్మకంగా జీవిస్తారు. వీరిపైన లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమె ఆశీర్వాదంతో వీరికి జీవితంలో డబ్బుకి కొరత ఉండదు. సంతోషాలలతో జీవితాన్ని గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వీరు ప్రయోజనాలను పొందుతారు.
సింహరాశి
సింహరాశి వారిని అన్ని రాశులలోకి గొప్ప రాశిగా చెబుతారు. ఈ సింహరాశి వారిని సూర్యుడు పాలిస్తాడు. ఈ రాశిలో జన్మించిన వారు లీడర్షిప్ ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సింహరాశి వారు దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరిపైన లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. లక్ష్మీకటాక్షం కారణంగా వీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. స్వయంగా విజయతీరాలకు చేరుకుంటారు. వారికి జీవితంలోనే ఎవరి నుండి డబ్బుసహాయం అవసరం ఉండదు.
మీనరాశి
మీన రాశి వారు లక్ష్మీదేవికి చాలా ప్రియమైన వారు. వారిని బృహస్పతి పాలిస్తుంది. ఈ రాశి జ్ఞానానికి, శ్రేయస్సుకు సూచికగా ఉంటుంది. ఇక మీన రాశి వారు అంకితభావంతో కనిపిస్తారు. అంతేకాదు మతపరమైన వారిగా కూడా ఉంటారు. పనిపట్ల వారి విశ్వాసం, అంకిత భావం లక్ష్మీదేవికి సంతోషం కలిగిస్తుంది. పూర్వీకుల ఆస్తులు, ఊహించని ఆర్థిక లాభాలతో లక్ష్మీదేవి వీరిని ఆశీర్వదిస్తుంది. మీన రాశి వారు బలమైన ఆర్థిక స్థితిని కలిగి, సంతోషమయ జీవితాన్ని గడుపుతారు.
Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications