రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ రాశులవారికి ప్రమాదాలు, జాగ్రత్త!
వేద జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంత అయితే ప్రాముఖ్యత ఉంటుందో, సూర్య, చంద్ర గ్రహణాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈసారి సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది..కుంభరాశిలో చంద్రగ్రహణం దృష్ట్యా నాలుగు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశులవారికి కష్టాలు, ప్రమాదాలు
వీరికి ఈ సమయంలో కష్టాలు, ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈసారి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9.50 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట 26 నిమిషాలకు పూర్తవుతుంది. గ్రహణ సమయం దాదాపు మూడున్నర గంటలపాటు ఉంటుంది. గ్రహణ గోచారం ప్రకారం అధమ ఫలితాలు ఆరు నెలల పాటు ఉంటాయి. చంద్రగ్రహణం కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల గురించి తెలుసుకుందాం.

కుంభరాశి
కుంభరాశి జాతకులు చంద్రగ్రహణం కారణంగా కష్టాలను చూస్తారు. వీరు ఆరు నెలల పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. సమయానికి ఆహారం తీసుకుని, సమయానుకూలంగా నిద్రపోవాలి. లేదంటే కుంభరాశి జాతకులు తీవ్ర అనారోగ్యం బారిన పడతారు. వీరు ఈ సమయంలో అశాంతి తగ్గించుకుని మానసికంగా ప్రశాంతతను పెంచుకోవాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు నాలుగో స్థానంలో చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారు విద్యాపరంగా ఆటంకాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఆస్తులను కొనుగోలు చేయడం, విక్రయించడం వీరికి మంచిది కాదు. వృశ్చిక రాశి జాతకులు చంద్రగ్రహణం నుండి ఆరు నెలల పాటు ఏ పని చేసిన ప్రతికూలతలను ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అష్టమంలో గ్రహణం ఉంది కాబట్టి వీరికి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం చాలా అవసరం, లేదంటే వీరు అనారోగ్యం బారిన పడే ప్రమాదం కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు బంధుత్వాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి
మీన రాశి వారు కూడా చంద్రగ్రహణం నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అజ్ఞాత శత్రువులు పెరుగుతారు .వృధా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. కనుక ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వారు తమ వెనుక జరుగుతున్న వాటిపైన దృష్టి పెట్టాలి. అతి జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications