చంద్ర గ్రహణం కారణంగా నష్టపోయే రాశులవారు
ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించబోతుండగా ఒక సూర్య గ్రహణం అయిపోయింది. రెండు చంద్ర గ్రహాలు, మరో సూర్యగ్రహణం మిగిలివుంది.
ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణం మే 5వ తేదీ శుక్రవారం జరగబోతోంది. బుద్ధ పూర్ణిమ కూడా అదే రోజు ఉంది. తులరాశి, స్వాతి నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుంది. దీని ప్రభావం రాత్రి 8.44 గంటల నుంచి అర్థరాత్రి 01.02 వరకు ఉంటుంది. ఆ సమయంలో అన్ని ఆలయాలను మూసేస్తారు. ఎవరూ ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు.
చంద్రుడిని మింగే ప్రయత్నాలు:పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడిని రాహువు, కేతువు మింగడానికి ప్రయత్నాలు చేస్తాయి. గ్రహణానికి కొన్ని గంటల ముందు సూతక కాల సమయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో పలు రాశులవారిపై చంద్ర గ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారిపై ఎంత ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రాశులవారిపై చంద్రగ్రహణ ప్రభావం
మేషరాశి:చంద్రగ్రహణం కారణంగా మేషరాశిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా తీవ్ర అనారోగ్య సమస్య బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి వైవాహిక జీవితం గడుపుతున్నవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
వృషభరాశి:శుక్రుడు వృషభ రాశికి అధిపతి. దీనివల్ల చంద్రగ్రహణం ఈ రాశివారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. కచ్చితంగా ఆరోగ్యం పట్ల వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ సమయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
చంద్రుడు బలోపేతమవడానికి:చంద్ర గ్రహణం సమయంలో జాతకంలో చంద్రుడి స్థానాన్ని బలోపేతం చేయడానికి తులసి ఆకులను నోటిలో వేసుకుని చంద్రుని బీజ మంత్రం లేదా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తుండాలి. గ్రహణ సమయంలో ఈ మంత్రాలను జపించడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. చంద్ర గ్రహణం వేళ గ్రహణ ప్రభావం తొలగి జాతకంలో ఉన్న చంద్రుడు బలోపేతమవుతాడు.












Click it and Unblock the Notifications