అరుదైన యోగంలో మాఘ పౌర్ణమి; నేడు ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం!!

పౌర్ణమి తిధికి సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన స్థానం ఉంది. నేడు మాఘ పౌర్ణమి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పౌర్ణమిని చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఈరోజు పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల, దానధర్మాలు చేయడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. శ్రీమహావిష్ణువుని పూజించిన వారికి సుఖసంతోషాలు, సంపదలు వస్తాయని నమ్ముతారు.

మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీన సాయంత్రం 6 గంటల 3 నిమిషాల వరకు కొనసాగుతుంది. అంటే నేటి సాయంత్రం వరకు మాఘ పౌర్ణమి ఘడియలు ఉంటున్నాయి. మనం ఏదైనా ప్రత్యేక రోజున జరుపుకోవాలని అనుకున్నప్పుడు ఉదయం వచ్చిన తిథిని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి మాఘ పూర్ణిమను నేడు జరుపుకుంటున్నాం.

Magha purnima in rare yoga; golden day for these zodiac signs today!!

జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ కన్యారాశిలో సంభవిస్తుంది. ఇది చాలా పవిత్రమైన సంఘటనగా చెప్పొచ్చు. మాఘ పౌర్ణమి 12 రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఈ సమయంలో ముఖ్యంగా మూడు రాశుల వారికి మాత్రం మాఘ పౌర్ణమి శుభాలను చేకూరుస్తుంది.

మాఘ పౌర్ణమి వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి వారిలో ఉన్న సృజనాత్మకత మరింత పెరుగుతుంది. క్రియేటివ్ రంగంలో పనిచేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు కన్న కలలన్నీ నిజమవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కుతాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం.
వృషభ రాశి వారు పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయడం ప్రారంభమవుతుంది. సొంత వ్యాపారాలను కలిగి ఉన్న వ్యక్తులు లక్ష్మీదేవి నుండి ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. చంద్రుని ప్రభావం కారణంగా ముఖ్యమైన పాత్ర పోషించే ప్రత్యేక వ్యక్తిని కలుసుకుంటారు జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ శృంగార జీవితం కూడా సంతోష దాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది.

కర్కాటకరాశి వారికి ఈ సమయం చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. చేసే పనిలో పురోగతిని సాధిస్తారు. మాఘ పౌర్ణమి మీకు ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. అనేక వనరుల నుండి డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది . మీకు వారసత్వంగా వచ్చిన ఆస్తుల నుంచి సంపదను పెంచుకో గలుగుతారు. కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొనుగోలు చేసుకోవాలనుకునే వారు త్వరగా రుణాన్ని పొందగలుగుతారు.

మకర రాశి వారికి మాఘ పౌర్ణమి శుభాలను చేకూరుస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు ఇప్పుడు ఎందులో పెట్టుబడి పెట్టిన గణనీయమైన లాభాలను ఆశించవచ్చు. ఈ సమయంలో మీరు స్థిరాస్తులలో పెట్టుబడి పెడితే అది మీకు ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది.

మకర రాశి వారికి ఈ సమయంలో మీకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కాని వారికి కొత్త వివాహ ప్రతిపాదనలు వస్తాయి. స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఇక ఆరోగ్యం విషయంలో కూడా ఇది అద్భుతమైన సమయం. వ్యాపార ప్రయత్నాలైనా, ఉద్యోగ ప్రయత్నాలైనా, విద్య ప్రయత్నమైన ఏదైనా సరే ఈ సమయంలో మంచి ఫలితాలను ఇస్తాయి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+