Maha shivratri 2024: మహా శివరాత్రి విశిష్టత.. ఉపవాస, జాగరణలు ఎందుకు చేస్తారంటే!!

పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం మహా శివరాత్రి మార్చి 8వ తేదీన వస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతాయి. మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు, శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు.

మహా శివరాత్రి పర్వదినానికి ఒక విశిష్టత ఉంది. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా నమ్ముతారు. ఇదే రోజు లింగోద్భవం జరిగిందని కూడా చెప్తారు. పరమశివుడు పురుషుడిని సూచిస్తే, పార్వతీ దేవి ప్రకృతిని సూచిస్తుంది . సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుంది. కనుక మహా శివరాత్రి చాలా ప్రత్యేకం.

Maha shivratri 2024 significance Why devotees doing fasting and jagaran

ఎవరైతే భక్తితో మహా శివరాత్రి నాడు శివుడిని పూజిస్తారో.. ఉపవాస, జాగరణ దీక్షలను ఆచరిస్తారో.. వారికి శుభాలు కలుగుతాయని, శివుడి కటాక్షం వారిపై ఉంటుందని చెబుతారు. మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే శివుడిని మనసులో లగ్నం చేసుకుని శివయ్యను ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తారో వారికి శివ సాయుజ్యం లభిస్తుందని చెప్తారు.

ఇక జాగరణతో కూడా సకల పాపాలు తొలగిపోయి పుణ్య గతులు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. మహా శివరాత్రి నాడు ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమ్రోగిపోతాయి. ప్రతి ఒక్కరు అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేకిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ప్రతి శైవ క్షేత్రంలోనూ కొనసాగుతాయి.

హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలన్నీ మారుమోగిపోతాయి. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుడిని మనసులో లగ్నం చేసుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, జాగరణ చేసి స్వామి కటాక్షం కోసం భక్తులు కఠిన దీక్షను ఆచరిస్తారు. మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం 6 గంటల సమయం నుండి రాత్రి రెండు గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం, బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు ప్రధానంగా నమ్ముతారు.

మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడిని ప్రార్థించడం ద్వారా ఎంతోమంది తమ పాపాలను అధిగమించి, పుణ్యలోకాలకు చేరుకున్నారని అనేక పురాణాలు ఇతిహాసాలలో చెప్పబడింది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా, శివయ్య అనుగ్రహం పుష్కలంగా ఉండే పర్వదినంగా జరుపుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+