దసరా నవరాత్రులలో మహాలక్ష్మీ రాజయోగం.. వీరి పంట పండుతుంది!
ప్రతి సంవత్సరం 9 రోజులపాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దసరా నవరాత్రులు మొదలవుతాయి. తిరిగి అక్టోబర్ 2 తో దసరా నవరాత్రులు ముగుస్తాయి. ఇక దసరా నవరాత్రులలో వివిధ గ్రహాల సంచారం కారణంగా శుభ యోగాలు ఏర్పడుతున్నాయి.
మహాలక్ష్మి రాజయోగం.. శుభ ఫలితాలను పొందే రాశులు
సెప్టెంబర్ 24వ తేదీన చంద్రుడు తులా రాశిలో కి ప్రవేశిస్తాడు. అప్పటికే కుజుడు తులా రాశిలో సంచారం చేస్తాడు.ఈ రెండు గ్రహాలు సంయోగం చెందడం వల్ల మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ మహాలక్ష్మి రాజయోగం చాలా శక్తివంతమైన యోగం. ఇది కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ మహాలక్ష్మి రాజయోగం కారణంగా శుభ ఫలితాలను పొందే రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

తులారాశి
తులారాశి వారికి మహాలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. దసరా సమయంలో తులారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరి వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఈ రాశివారికి ఈ సమయంలో విశ్వాసం పెరుగుతుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో ఇతరులకు సహాయం చేస్తారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. పెళ్లిళ్లు కాని వారికి వివాహ యోగం ఉంది వ్యక్తిగత జీవితం బాగుంటుంది. అనుకున్న లక్ష్యాలు సాధించడానికి కష్టపడతారు.
మకర రాశి
మకర రాశి వారికి మహాలక్ష్మి యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. దసరా సమయంలో వీరికి ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. బిజినెస్ ట్రిప్పులు వేస్తారు. మకర రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన విజయం వరిస్తుంది. మకరరాశి జాతకులు మహాలక్ష్మి రాజయోగంతో సంతోషంగా ఉంటారు.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు నవరాత్రుల సమయం మంచి సమయం. ఈ సమయంలో కుంభ రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. మీరు ఏం చేసినా కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. విద్యార్థులు మంచి ఫలితాలను చూస్తారు. ఇది కుంభ రాశి వారికి ప్రేమ జీవితాన్ని మధురం చేస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications