నవంబర్, డిసెంబర్ రెండు నెలలు ఈ రాశుల వారింట సంతోషాల దీపావళి!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవ జీవితాన్ని నిర్ణయించేవి మానవుల జాతకాన్ని ముందుకు నడిపించేవి నవగ్రహాలు. ఈ గ్రహాల కదలికల కారణంగా, వివిధ రాశుల్లో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు గ్రహాలు తిరోగమనంలో సంచరిస్తాయి. ఇది అన్ని రాశుల వారి మీద ప్రత్యేకమైన ప్రభావాలను చూపిస్తుంది.

నవంబర్ మాసంలో గ్రహాల సంచారం
అయితే నవంబర్ మాసంలో గ్రహాల సంచారం కారణంగా రెండు నెలల పాటు వివిధ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.ప్రస్తుతం శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. నవంబర్ మొదటి వారంలో శుక్రుడుధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత నవంబర్ 15వ తేదీన శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తాడు.

main planets transit in november and december these zodiac signs are getting wealth luck from diwali

రెండు నెలల పాటు కొన్ని రాశులవారికి దీపావళి
ఇక నవంబర్ 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 16వ తేదీ వరకు సూర్యుడు వృశ్చిక రాశి లోనే ఉంటాడు. ఆపై డిసెంబర్ 26వ తేదీన బుధ సంచారం జరుగుతుంది. ఇలా ముఖ్య గ్రహాల రవాణాతో ఐదు రాశుల వారికి శుభాలు జరుగుతాయి. ఈ ఏడాది చివరి వరకు సంతోషాల దీపావళిని సంబరంగా జరుపుకునే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి నవంబర్, డిసెంబర్ నెలలు చాలా శుభ ఫలితాలను ఇస్తున్నాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి సంపద పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా అందులో లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి రానున్న రెండు నెలలు చాలా సంతోషంగా గడిచిపోతాయి. దీపావళి నుంచి క్రిస్మస్ వరకు వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతుల తో పాటు, ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కర్కాటక రాశి జాతకులకు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు విజయాలను సాధిస్తారు.

తులారాశి
తులా రాశి వారికి వచ్చే రెండు నెలలు సంతోషాన్ని ఇచ్చే నెలలుగా మారుతున్నాయి. ఈ సమయంలో వీరికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త ఉద్యోగాలను సాధిస్తారు. ఒంటరిగా ఉన్నవారికి చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి జీవిత భాగస్వాములు దొరుకుతారు. ఈ సమయంలో వీరు రెట్టించిన ఉత్సాహంతో ఉంటారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఏడాది చివరి రెండు నెలలు చాలా అద్భుతంగా గడవనున్నాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు. అదృష్టం వీరికి కలిసివస్తుంది.

కుంభరాశి
నవంబర్, డిసెంబర్ నెలలు కుంభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే నెలలుగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కుంభ రాశి వారికి పురోగతి సాధ్యమవుతుంది. వర్తక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడి పెరుగుతుంది. ఏలినాటి శని నుండి కుంభ రాశి వారికి విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో అనేక శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో అన్నింట విజయాలను కుంభ రాశి వారు సొంతం చేసుకుంటారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+