మాలవ్య మహాపురుష రాజయోగంతో వీరికి లక్ష్మీ కటాక్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ఒక ప్రముఖమైన స్థానం ఉంటుంది. సంపదలకు, విలాసాలకు, ప్రేమకు అధిపతి అయిన శుక్రుడు మార్చి నెలలో ఉన్నతమైన రాశి అయిన మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ప్రతినెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేసే శుక్రుడు మార్చి నెలలో చేసే సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.
మార్చిలో మాలవ్య మహాపురుష రాజయోగం
మార్చి నెలలో శుక్ర సంచారం కారణంగా మాలవ్య మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు మీ సంచార చార్ట్ లో 9వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. మతపరమైన కార్యకలాపాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనాలను పొందుతారు. కర్కాటకరాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
మిధున రాశి
మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులకు కలిసి వస్తుంది ఈ రాజయోగం మిధున రాశి యొక్క కర్మ భాగంలో ఏర్పడడం వల్ల ఈ సమయంలో మీరు ఏ పని చేసినా వర్తక వ్యాపారాలు చేసిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి కెరీర్లో ఉన్నతి కనిపిస్తుంది.మిధున రాశి వారు కొత్త బాధ్యతలను చూస్తారు. వ్యాపారవేత్తలు గణనీయమైన ఆర్థిక లాభాలను చూస్తారు. కొత్త ఒప్పందాలను ఖరారు చేసుకుంటారు.
మీన రాశి
మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రాజయోగం మీ రాశిలో లగ్న గృహంలో జరుగుతుంది. దీని వల్ల మీన రాశి వారికి లబ్ది జరుగుతుంది . మీనరాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. వైవాహిక జీవితం మధురంగా సాగుతుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు ప్రయోజనాలను ఇస్తాయి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications