మాలవ్య రాజయోగంతో ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే

గ్రహాలు సంచారం అన్ని రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులను తెస్తుంది. వృషభ రాశిలో శుక్ర సంచారం కారణంగా మాలవ్య రాజయోగం ఏర్పడింది. శుక్రుడు జాతకంలోని మొదటి, నాలుగు, ఏడు, పదో ఇంట్లో ఉన్నప్పుడు, వృషభం, తులారాశి లేదా ఉన్నతరాశి అయిన మీన రాశిలో ప్రవేశించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది.

పంచ మహా పురుష యోగాలలో మాలవ్య యోగం ఒకటి
ప్రస్తుతం వృషభంలో శుక్రుడు ఉండడం వల్ల, శుభ స్థానంలో ఉండడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడింది. పంచ మహాపురుష యోగాలలో మాలవ్య రాజయోగాన్ని ఒకటిగా చెబుతారు. ఇక ప్రస్తుతం మాలవ్య రాజయోగం కారణంగా జూన్ నెలలో లబ్ధిని పొందే విశేషమైన రాశులను గురించి తెలుసుకుందాం.

Malavya Rajyoga with venus Royal life for these zodiac signs

వృషభ రాశి

మాలవ్య రాజయోగం వల్ల వృషభ రాశి వారు విశేషమైన ఫలితాలను పొందుతారు. మీరు ఈ సమయంలో ఆర్థిక లాభాలను చూస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఆరోగ్య శ్రేయస్సును కలిగిస్తుంది. సహోద్యోగుల నుండి పనిలో మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారు వివాహాలను ఖరారు చేసుకోవచ్చు. కుటుంబసభ్యులతో ఈ సమయం చాలా ఆనందంగా ఉంటుంది. ఆర్థికపరమైన నిర్ణయాలలో తండ్రి సలహా తీసుకోవడం మంచిది.

కన్యారాశి
మాలవ్య రాజయోగంతో కన్యారాశి వారికి లబ్ది చేకూరుతుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామి అన్ని ముఖ్యమైన బాధ్యతలలో మీకు పూర్తిగా సహాయం చేస్తారు. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగస్తులు తమ కలల ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మీ సీనియర్ అధికారులు మీకు పనిలో సహాయం చేస్తారు. పిల్లల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు

తులారాశి
మాలవ్య రాజయోగంతో తులా రాశిలో పుట్టిన వారికి ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో ఆర్థికలాభాలు కలుగుతాయి. మీరు ఉద్యోగం గురించి ఈ సమయంలో కొన్ని సానుకూల వార్తలను వినవచ్చు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు అందుకునే సమయం. ఈ సమయంలో మీకు రుణవిముక్తి కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రత్యర్థులపై ఈ సమయంలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

కుంభరాశి
మాలవ్య రాజయోగం తో కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుంభ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో వృత్తిపరమైన కీర్తి కూడా పెరుగుతుంది. కుంభరాశి వారు ఈ సమయంలో కుటుంబ ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటే అవి ఈ సమయంలో తగ్గుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+