మార్చి నెలలో దురదృష్ట రాశులవారు వీరే.. మీరుంటే జాగ్రత్త!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రవాణా, వివిధ గ్రహాల కలయిక ద్వాదశ రాశుల వారి జీవితాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక మార్చి నెలలో గ్రహాల రవాణా కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తే, మరికొన్ని రాశులవారికి దురదృష్టాన్ని మోసుకొస్తుంది. మార్చి నెలలో ముఖ్యంగా మూడు రాశుల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందిని టారో కార్డు పఠనం సూచిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటి? అనేది ప్రస్తుత మనం తెలుసుకుందాం.
టారో కార్డు పఠనం జ్యోతిష్య అంచనా ప్రకారం మార్చి నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో కొన్ని రాశులవారికి అదృష్టం పట్టనుంటే, మరికొన్ని రాశులను దురదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఇక ఆ రాశుల వివరాల్లోకి వెళితే.. మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ప్రేమ సంబంధమైన జీవితంలో ప్రతికూలత కలుగుతుంది. ఈ ప్రతికూలతలు తమ సంబంధాలపై విశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి.

కర్కాటక రాశి వారికి ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగ విషయంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంది. టారో కార్డు జ్యోతిష్య అంచనా ప్రకారం ఈ సమయంలో కర్కాటక రాశి వారి జీవితంలో ఇబ్బందులు వస్తాయి.
ఇక టారో అంచనాల ప్రకారం సింహరాశి దురదృష్టాన్ని ఎడుర్కొబోతుంది. ప్రేమ విషయంలో సింహ రాశి వారు అనిశ్చితిని, అసౌకర్య భావనను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కొత్త సంబంధాలలో మోసాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక పరంగా కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. ఇక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, దినచర్యలో భాగంగా క్రమశిక్షణను అలవాటు చేసుకుని వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
టారో కార్డు జ్యోతిష్య అంచనా ప్రకారం ధనుస్సు రాశి వారికి ఈనెల కఠినమైన నెలగా చెబుతున్నారు. ఈ సమయంలో ఏ పని చేసినా ప్రతికూలంగా మారుతుందని, జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. ఆర్థిక పరంగాను తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. ఇక ఆరోగ్య సమస్యలను ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఈ సమయంలో ఆందోళన, నిరాశ పెరిగిపోతాయని, స్వీయ సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications