2025లో షడష్టక యోగంతో పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యే రాశులవారు వీరే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహసంచారాలు సాధారణ దృగ్విశయమే. అయినప్పటికీ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి వెళ్ళినప్పుడు వేరే గ్రహాలతో కలవడం వల్ల శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన సూర్యుడు మరియు అంగారకుడు మధ్యాహ్నం రెండు గంటల 8 నిమిషాలకు షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నారు.
సూర్య అంగారకుల షడష్టక యోగం
సూర్యుడు మరియు అంగారకుడు ఒకదానికొకటి ఆరవ మరియు ఎనిమిదవ గృహాలలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాల మధ్య గరిష్టంగా 150 డిగ్రీల వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ షడష్టక యోగం వల్ల కొన్ని రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది.

మేష రాశి
మేష రాశి వారికి షడష్టక యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మేషరాశి జాతకులు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. మేష రాశి వారి కెరీర్ లో పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వారికి శుభం జరుగుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతులు ఇంక్రిమెంట్లు పొందుతారు. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. ఇది మేషరాశి వారికి అదృష్ట కాలం.
సింహరాశి
షడష్టక యోగం కారణంగా సింహరాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సమయంలో సింహ రాశి వారి ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. వివిధ వ్యాపారాలు చేసేవారు వ్యాపారాల నుండి పెద్ద ఎత్తున సంపాదిస్తారు. ఈ సమయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి
సూర్యుడు మరియు అంగారకుడు షడష్టక యోగాన్ని ఏర్పరచడంతో ధనుస్సు రాశి వారికి మేలు జరుగుతుంది. ధనుస్సు రాశి వారి ఆదాయ స్థాయిలలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఈ కాలంలో ధనుస్సు రాశి వారు చాలా పొదుపు చేస్తారు. నూతన ఉద్యోగస్తులు ఆఫర్లు పొందే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాలు సాధిస్తారు. కొత్త ఆస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో ధనుస్సు రాశి స్థానికుల ఆరోగ్యం బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications