కుజుడు ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులకు ధన లాభం
కుజుడు అనేది అంగారకుడు గ్రహానికి పెట్టబడిన పేరు. ఇది సౌర కుటుంబం సూర్యుని చుట్టూ పరిభ్రమించే 9 గ్రహాలలో నాలుగో స్థానంలో ఉంటుంది.సౌర వ్యవస్థలోని గ్రహాలలో నాలుగో స్థానంలో ఉండే అంగారకుడు, పురుష గ్రహం. దీని రంగు కారణంగా 'అరుణ గ్రహం' అని కూడా పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు ధైర్యం, సాహసం, చొరవకు ప్రతీక.కుజుడు భూ లాభం, స్థిరాస్తులకు కారకుడు. జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే ఆ రాశుల వారికి శుభాలు కలుగుతాయి.
కుజుడు ఏ రాశికైనా 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు కుజ దోషం ఏర్పడుతుంది.అయితే 80 రోజుల తర్వాత కుజుడు ప్రత్యక్ష సంచారం చేయబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి లాభం చేకూరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.కుజుడు ఏ రాశులపై ప్రభావం చూపించనున్నారో ఓసారి పరిశీలిద్దాం.కుజుడు ప్రత్యక్ష కదలిక మిథున రాశి, సింహ రాశి, తులా రాశుల వారి మీద ప్రభావం చూపించనుంది.

ముందుగా తులారాశి వారి గురించి ప్రస్తావిస్తే..తులారాశి వారికి కుజ సంచారం అదృష్ట రోజులను సృష్టిస్తుంది. అదృష్టం మీకు సాకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తోంది.విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధపడే వారు విజయం సాధిస్తారు. ప్రయాణాలకు ఆస్కారం ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథున రాశి వారిపై కూడా కుజుని ప్రభావం కనిపిస్తోంది. కుజుని ప్రత్యక్ష సంచారం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న లక్ష్యాలను సాధించే విధంగా దూసుకుపోతారు.ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక లాభాలకు అవకాశాలు లభిస్తాయి.సమాజంలో ప్రతిష్ఠ పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలతో విజయం లభిస్తుంది.
కుజుడు ప్రత్యక్ష సంచారం వల్ల సింహ రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తోంది. నూతన ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడతాయి.భూమి, భవనం, వాహనం కొనుగోలుకు సింహ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడంతో మనసు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగుస్తులకు పదోన్నతి లభిస్తుంది.
గమనిక : వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications