నాలుగురోజుల్లో వీళ్ళు అపర కుబేరులు కాబోతున్నారని కన్ఫర్మ్ చేసిన కుజుడు

వేద జ్యోతిషశాస్త్రంలో కుజుడికి ఉన్న స్థానం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈనెల 28వ తేదీన కుజుడు కన్యారాశిలో ప్రవేశించి సుమారు 47 రోజులపాటు అక్కడే ఉంటాడు. సెప్టెంబర్ 14వ తేదీ వరకు కన్య రాశిలోనే కుజ సంచారం కొనసాగుతుంది. కన్యారాశిలో ఉన్న సమయంలో కుజుడు కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను చేకూరుస్తున్నాడు. కుజ సంచారం కారణంగా లబ్ధిని పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం

మేషరాశి
జూలై 28 నుండి మేష రాశి వారికి కుజుడు మంచి ఫలితాలను ఇస్తున్నాడు, కుజుడు ఆరవ గృహంలో సంచరించడం వలన మేష రాశి వారికి పోటీ తత్వం పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోట విజయాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య సమస్యల నుండి వ్యక్తిగతమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

Mars confirms that they are going to become super-rich in four days

కర్కాటక రాశి
కర్కాటక రాశిలో కుజుడు మూడో స్థానంలో సంచరించడం వల్ల మీరు ఏ రంగంలో పనిచేస్తున్న మంచి ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు చేసే వారికి కూడా లాభాలు చేకూరుతాయి.

సింహరాశి
జూలై 28 నుండి కుజ సంచారం కారణంగా సింహ రాశి వారికి కలిసి వస్తుంది. సింహరాశిలో కుజుడు రెండవ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆస్తులు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఇది అదృష్ట సమయం.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజుడు లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల జూలై 28 తర్వాత నుండి లాభాలు వస్తాయి. మీరు ఏ పని చేసినా ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి కుజుడు పదవ స్థానంలో సంచరించడం వల్ల వారికి ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ప్రగతి ఉంటుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి
కుజ సంచారం మకర రాశి వారికి కలిసి వస్తుంది. మకర రాశిలో కుజుడు 9వ స్థానంలో సంచరించడం వల్ల వారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ధనయోగం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. విదేశీ ప్రయాణాలు చేసే వారు అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతారు. తండ్రివైపు ఆస్తి కలిసి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+