ఏప్రిల్ మాసంలో ఈ రాశులవారికి డబ్బులమూటలు మోసుకొస్తున్న కుజుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ గ్రహం దేనికదే ప్రత్యేకం. కుజ గ్రహం కూడా మానవ జీవితాలపై తన బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కుజ గ్రహం నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించి తన సంచారాన్ని సాగిస్తుంది. కుజ గ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర మార్పు కూడా అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడిని డబ్బుకు, ఆనందానికి, శ్రేయస్సుకు సూచనగా భావిస్తారు.
కుజ సంచారం
ఏప్రిల్ మూడవ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి సంచారం సాగించబోతున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 12వ తేదీన కుజుడు పునర్వసు నక్షత్రం లోకి తన సంచారాన్ని ప్రారంభిస్తాడు . కుజుడి గ్రహ మరియు నక్షత్ర సంచారం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సంతోషం పెరుగుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
కుజుడు ఏప్రిల్ నెలలో రాశి సంచారం చేయడంతో పాటు, నక్షత్ర సంచారం చేయడం వల్ల వృషభ రాశి జాతకులకు లబ్ది జరుగుతుంది. వృషభరాశిలో జన్మించిన వ్యక్తులకుకుజుడి డబుల్ సంచారం ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా కొన్ని రంగాల్లో పనిచేసే వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభం వస్తుంది. కెరీర్ పరంగాను లాభాలు వస్తాయి. ఇది వృషభ రాశి వారికి సంపదలను ఇచ్చే కాలం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో కుజ సంచారం వలన అనేక ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వర్తక, వ్యాపారాలు చేసే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో వీరు అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు లాభపడతారు.కెరీర్ పరంగా వస్తున్న సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
తులారాశి
కుజుడి డబుల్ సంచారం కారణంగా ఏప్రిల్ మాసంలో తులా రాశి వారికి లబ్ధి జరుగుతుంది. తులారాశి జాతకులు ఏప్రిల్ నెల నుంచి విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి కూడా పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం చాలా మంచి లాభాలు ఇస్తుంది. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications