కన్యారాశిలోకి కుజుడు.. ఈ రాశులవారంతా కుబేరులే

కన్యారాశిలోకి ప్రవేశించిన కుజుడు అక్టోబరు 3వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల ఐదు రాశులవారికి బాగా కలిసి రానుంది. కుజుడు కన్యారాశిలోని 6వ ఇంటికి యజమాని. సంక్రమణ కాలంలో ఈ రాశులవారికి వృత్తి, ఉద్యోగం, ధనలాభంతోపాటు కుటుంబ ఆనందం కూడా లభిస్తుంది.

మేషరాశి
ఈ రాశివారికి కుజుడి సంచారం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఎంత ఎక్కువ శ్రమపడితే అంత ఎక్కువగా ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది. ఎప్పటినుంచో ఉన్న కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. అయితే ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే పరిస్థితి దిగజారిపోతుంది. తర్వాత విచారించి ఉపయోగం ఉండదు.

Mars enters Virgo and stays there till October 3rd.

మిథున రాశి
మిథునరాశివారికి శుభాలే కలుగుతాయి. అన్ని పనుల్లోను సానుకూల ఫలితాలే ఎదురవుతాయి. వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు సంక్రమిస్తాయి. వీటికోసం ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అవసరమైన సమయానికి కచ్చితంగా డబ్బు చేతికందుతుంది.

కన్య రాశి
ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుంది. గతంలో మొదలై ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. పనిచేసేచోట ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది.

వృశ్చిక రాశి
తండ్రి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. సంబంధాలన్నీ బలోపేతమవుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఏ పని తలపెట్టిన జీవిత భాగస్వామితో సంప్రదించి తగు సూచనలు తీసుకొని చేయడంద్వారా విజయవంతమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.

ధనుస్సు రాశి
కుజుడి సంచారం వీరికి బాగా కలిసివస్తుంది. అన్నివైపుల నుంచి విజయాలే ఎదురవుతాయి. వృత్తిలో ఉన్నవారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఊహించనిరీతిలో ధన లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+