సూర్యుడి రాశిలోకి కుజుడు.. ఈ రాశులకు మహదైశ్వర్యం

జ్యోతిష్యం ప్రకారం ధైర్యం, భూమి, వివాహానికి కారకుడు కుజుడు. జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటే దేనికీ లోటుండదు. అశుభ స్థానంలో ఉంటేమాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 7వ తేదీన అంగారకుడి సంచారం జరగబోతోంది. కుజుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ పరిణామం నాలుగు రాశులవారికి కలిసిరానుంది. ఏయే రాశులనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభరాశి
కుజుడు రాశి మార్చడంవల్ల వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీరికి జీవితంలో ఏ లోటూ లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం చేసే పనులన్నీ విజయవంతమవుతాయి.

zodiac sign

సింహ రాశి
సింహరాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదృష్టం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. విలువైనదాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీరికి కూడా ఆకస్మిక ధనలాభం ఉంది. డబ్బును పొదుపు మార్గాలవైపు మళ్లిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

ధనుస్సు
ధనుస్సు రాశివారికి కుజుడి సంచారం కలిసిరానుంది. గతంలో మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. అలాగే విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. పనులన్నీ సరైన సమయంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి.

zodiac sign

వృశ్చిక రాశి
వీరికి వృత్తిపరమైన లాభాలు కలుగుతాయి. ఉన్న డబ్బు రెట్టింపవుతుంది. ఉద్యోగం లేనివారికి ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. దీంతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢపడుతుంది. ఊహించని ధనలాభాన్ని సూచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+