దీపావళి తర్వాత వీరికి లాటరీ.. ఇది ఫిక్స్!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు కాలానుగుణంగా తమ రాశీ చక్రాలను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. వీటి ప్రభావం మానవ జీవితం పైన పడుతుంది. గ్రహాల అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ప్రస్తుతం విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్న కుజుడు నవంబర్ ఒకటవ తేదీ వరకు విశాఖ నక్షత్రం లోనే ఉంటాడు.

కుజుడి నక్షత్ర సంచారం
దీపావళి తర్వాత నవంబర్ ఒకటవ తేదీన కుజుడు శని నక్షత్రమైన అనురాధ నక్షత్రంలో సంచరిస్తాడు. అనురాధ నక్షత్రంలో కుజ సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సంపదలో అపారమైన పెరుగుదల ఉంటుంది. ఆస్తులు, వాహనాలను కొనుగోలు చేయవచ్చు. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

mars transit into anuradha nakshatra gives luck and happiness to these zodiac signs

మిధున రాశి
మిధున రాశి వారికి అనురాధ నక్షత్రంలో కుజ గ్రహ సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీర్ఘకాల ఆర్థిక ఇబ్బందులు పరిష్కారమవుతాయి. కొత్త ఇల్లు లేదా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. ఉద్యోగాలు చేసే వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. వృత్తిపరంగా బాగా రాణిస్తారు.

మకర రాశి
మకర రాశి వారికి కుజ గ్రహ సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. సంపదలో పెరుగుదలను అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేసిన పనికి తగిన ఫలితం వస్తుంది. పనిలో మీ కృషి ప్రశంసించబడుతుంది. సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

తులారాశి
తులా రాశి జాతకులు కుజ గ్రహ సంచారం కారణంగా ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, జీతాల పెరుగుదల ఉంటుంది. చాలా కాలంగా కష్టపడి పనిచేసే వారికి ఇప్పుడు ప్రతిఫలం కనిపిస్తుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు అందుబాటులో ఉంటాయి. కెరీర్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ మద్దతు లభిస్తుంది.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+