ఏప్రిల్ లో కుజసంచారంతో 18 నెలలు వీరికి తిరుగే లేదు.. లక్ష్మీ కటాక్షం!

వేద జ్యోతిష శాస్త్రంలో కుజ గ్రహాన్ని కీడు గ్రహంగా చీకటి గ్రహంగా పరిగణిస్తారు. కుజుడు కూడా సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారి పైన తన ప్రభావాన్ని చూపిస్తాడు. సహజంగా కోపానికి, సాహసానికి, శక్తికి ప్రతిరూపంగా పరిగణించే కుజుడు 18 నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు.

ఏప్రిల్ లో కుజుడి రాశి సంచారం
ఏప్రిల్ మూడవ తేదీన కుజుడు మిధున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇక ఈ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కుజసంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులవారు ఎవరు అనేది తెలుసుకుందాం.

Mars transit into cancer in april these zodiac signs will get huge wealth for 18 months

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారి అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసిన సానుకూల ఫలితాలు వస్తాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. ఇది కర్కాటక రాశి వారికి అద్భుత సమయం.

ధనస్సు రాశి
కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ధనుస్సు రాశి వారికి 18 నెలల కాలం అద్భుతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలపరంగా వీరు విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. సొంత వ్యాపారాలు చేస్తున్న వారికి అనేక లాభాలు వస్తాయి. ధనస్సు రాశి వారికి ఈ సమయం అన్ని రంగాల్లోనూ విజయాలు సాధించడానికి అవకాశం ఇస్తుంది. నిరుద్యోగ యువత ఈ సమయంలో కొత్త అవకాశాలను పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది.

వృశ్చిక రాశి
కుజుడి రాశి మార్పు కారణంగా వృశ్చిక రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. ఉన్నత చదువులు చదవాలనే వారి కోరిక ఈ సమయంలో తీరుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+