జులైలో వీరికి సంపదల ఖజానా పంపిస్తానని మాటిచ్చిన కుజుడు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలు మానవ జీవితాలను ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి శక్తివంతమైన సంఘటనల్లో ఒకటిగా చెప్పబడింది ఇక అటువంటి సౌర వ్యవస్థలోని ప్రముఖ గ్రహాలలో కుజ గ్రహం ఒకటి కుజుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ఒక నక్షత్రంలో నుంచి నక్షత్రం లోకి మారుతూ ద్వాదశి రాశి వారి జీవితాలు పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు.
కన్యా రాశిలో కుజ సంచారం
జూలై 28 2025 లో కుజుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు. కన్య రాశిలో కుజ సంచారం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితం అవుతున్నాయి. కుజ సంచారంతో ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
కన్యా రాశిలో కుజ సంచారం మేష రాశి వారికి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలలో అనేక అవకాశాలను ఇస్తుంది. మేషరాశి వారి వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది. మేషరాశి జాతకులు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. మేషరాశి జాతకులు పిల్లల నుండి శుభవార్తలు వింటారు. జీవితంలోని వివిధ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
సింహరాశి
సింహరాశి జాతకులకు జూలై మాసంలో జరిగే కుజ సంచారం కలిసి వస్తుంది. వీరు వివిధ పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. వృత్తి జీవితంలో పురోగతికి అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా లాభాలు వస్తాయి. కెరీర్ కి సంబంధించి శుభవార్తలు వింటారు. కృషికి తగిన పదోన్నతులు లభిస్తాయి. జీవితంలో శాంతి, సంతోషం ఉంటుంది. ఆర్థికస్థితి గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారవేత్తలు డబ్బులు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు కుజ సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకుల ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. ఊహించని ఆర్థిక వనరుల నుంచి డబ్బులు వస్తాయి. వృశ్చిక రాశి వారి సామాజిక స్థితి పెరుగుతుంది. ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు పరిపూర్ణతతో ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications