బుధ శుక్రులు కలిసిన లక్ష్మీనారాయణ రాజయోగం ప్రకటించింది వీరికి కుబేర యోగం!
అక్టోబర్ మాసానికి వేద జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రాధాన్యత ఉంది. అక్టోబర్ మాసంలో వివిధ గ్రహాల గమనం, గ్రహాల సంయోగం రాశుల వారి పైన ప్రతికూల లేదా సానుకూల ప్రభావాలను కలిగిస్తాయి. ముఖ్య గ్రహాల కలయిక ,సంచారం ద్వాదశ రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక అక్టోబర్ మాసంలో బుధ శుక్రుల కలయిక లక్ష్మీనారాయణ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది.
లక్ష్మీనారాయణ రాజయోగం
అక్టోబర్ 13వ తేదీన శుక్రవారం ఐదు గంటల 49 నిమిషాలకు శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆపై అక్టోబర్ 29వ తేదీన 10:00 24 నిమిషాలకు బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే వృశ్చిక రాశిలో ఉన్న శుక్రుడితో బుధుడు సంయోగం జరుగుతుంది. సంవత్సరం తర్వాత ఈ రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది. ఫలితంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగంతో వివిధ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మకర రాశి
బుధ శుక్ర గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగంతో మకరరాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. మకరరాశి వారి లాభ గ్రహంలో బుధ శుక్ర సంయోగం జరుగుతుంది. కాబట్టి మకరరాశి వారు ఈ సమయంలో అన్ని రంగాలలోనూ మంచి ఫలితాలను సాధిస్తారు. మకరరాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో పిల్లలు పురోగతిని సాధిస్తారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి.
తుల రాశి
బుధ శుక్ర సంయోగం కారణంగా ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం తులారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. తులారాశి వారి సంపద గృహంలో బుధశికర గ్రహాల సంయోగం జరుగుతుంది. ఈ సమయంలో తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక లాభాలను పొందుతారు. తులా రాశి వారికి ఈ సమయంలో ఆశించిన లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తులారాశి వారు కోరుకున్న కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో బుధ శుక్ర గ్రహాలు కలయిక కారణంగా ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారి లగ్న గృహంలో బుధ శుక్ర గ్రహాల సంయోగం జరుగుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. వృశ్చిక రాశి జాతకులు శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది. పెళ్లయిన వారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి భారీ లాభాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications