సెప్టెంబర్ లో వీరికి కుబేరయోగం అనుగ్రహించిన బుధుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. బుధ గ్రహాన్ని కమ్యూనికేషన్ కు, తెలివితేటలకు, స్నేహానికి కారకుడిగా చెబుతారు. సెప్టెంబర్ మాసంలో బుధుడు సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి వెళుతున్నాడు. సెప్టెంబర్ 4వ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు.
మూడు రాశుల వారికి అదృష్టం
సెప్టెంబర్ నెలలో బుధుడు, శుక్రుడు, కుజుడు గ్రహాల కీలక మార్పులు సంభవిస్తున్నాయి. ఈ కీలక మార్పులు అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బుధుడు జాతకంలో శుభ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు వస్తాయి.అయితే బుధుడి శుభ స్థానాల కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
బుధ గ్రహ సంచారం కారణంగా మేష రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. మేషరాశి జాతకులకు ఆదాయం పెరుగుతుంది. తల్లిదండ్రుల నుండి సంపద వస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులకు కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేసేవారు శుభవార్తలు వింటారు. వస్తు యోగం, వాహన యోగం కలుగుతుంది. మేషరాశి వారికి ఈ సమయం నిజంగా అదృష్ట సమయం
మిధునరాశి
బుధ గ్రహ సంచారం కారణంగా మిధున రాశి వారు సంతోషంగా జీవిస్తారు. మిధున రాశి జాతకులు ఈ సమయంలో తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలోనూ పురోగతి కనిపిస్తుంది. విద్యాపరమైన పనులు ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తాయి. సంతానంలోనూ సంతోషం పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.
సింహరాశి
బుధ గ్రహ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగ వ్యాపార రంగాలలో గణనీయమైన పురోభివృద్ధిని సాధిస్తారు. సింహ రాశి వారికి అధికారుల సహకారం లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. స్థాన మార్పు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయం సింహరాశి వారికి నిజంగా శుభసమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications