వృషభ రాశిలోకి ప్రవేశించిన బుధుడు.. ఈ రాశులవారికి కనకవర్షం
జూన్ 15న రాత్రి 8.23 నిమిషాలకు చంద్రుడు మేషరాశిని విడిచి వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికీ అదే రాశిలో బుధుడు సంచరించబోతున్నాడు. దీనితో శుక్రుని రాశిలో బుధుడు-శుక్రుడు కలయిక ఏర్పడనుంది. ఈ గ్రహాల సంయోగం ఈ రాశుల వారికి కలిసి రానుంది. ఇందులో మీరున్నారా మరి చూసుకోండి!
జ్యోతిష్యాన్ని కొంతమంది నమ్ముతారు.. మరికొందరు నమ్మరు. అయితే మన రాశులను బట్టే గ్రహాల ప్రభావం ఉంటుందంటారు జ్యోతిష్య పండితులు. ఈ ప్రభావంవల్ల కొన్నిరాశుల వారికి మంచి ఫలితాలు దక్కితే మరికొందరికి ఫలితాలు కలగవు. ఈనెల 15న రాత్రి 8.23 గంటలకు చంద్రుడు మేషరాశిని విడిచి వృషభరాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం బుధుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి రాశిలో బుధుడు-శుక్రుడు కలయిక ఏర్పడనుంది. ఈ సంయోగం కొన్ని రాశులవారికి కలిసివస్తోంది. ఏయే రాశులనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభరాశి:ఈ రాశిలోనే చంద్రుడు, బుధుడి కలయిక ఏర్పడబోతోంది. దీనివల్ల ధనలాభం కలుగుతుంది. అలాగే వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటికి సులువుగా పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది.
కన్యారాశి:ఈ రాశివారు వ్యాపారాల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే కొత్తగా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నవారికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం ఉంటుంది. ప్రేమానురాగాలను పొందుతారు.
మకరరాశి:మకర రాశి 5వ ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు. దీనివల్ల ఆదాయం పెరగడంతోపాటు అదనపు ఆదాయానికి మార్గాలు తెలుసుకుంటారు. పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నవారికి ఇది మంచి సమయం. ఎంత కష్టపడితే అందుకు తగ్గట్లు ఫలితం కూడా ఉంటుంది.












Click it and Unblock the Notifications