రివర్స్ లో తిరుగుతూ వీరికి సంపదల వర్షం కురిపిస్తానని మాటిచ్చిన బుధుడు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడిని కమ్యూనికేషన్ కు ప్రతినిధిగా చెప్తారు. అటువంటి బుధుడు ప్రస్తుతం తిరోగమనం చెందబోతున్నాడు. బుధుడు తిరోగమనం ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. జూలై మాసంలో బుధుడు తిరోగమనం చెందుతాడు. సవ్య దిశలో సంచరించే బుధుడు, అపసవ్య దిశలో తిరగడం ప్రారంభిస్తాడు.

బుధుడి తిరోగమనం
జూలై 18వ తేదీ నుంచి మొత్తం 25రోజుల పాటు బుధుడు తిరోగమనంలో సంచరిస్తాడు. జులై 18వ తేదీ ఉదయం 10 గంటల 13 నిమిషాల నుంచి బుధుడు తిరోగమనంలోకి మారతాడు. ఆగస్టు 11వ తేదీ మధ్యాహ్నం బుధుడు తిరోగమన స్థితిలో తన సంచారాన్ని ముగిస్తాడు. ఇక బుధుడు తిరోగమనం కొన్ని రాశుల వారి జీవితంలో మంచి మార్పులకు కారణమవుతుంది. వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

mercury gave assurance to these zoidac signs with wealth with retrograde from july 18th

వృశ్చిక రాశి
జూలై 18వ తేదీ నుంచి బుధుడి తిరోగమన సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో మీ కెరీర్ బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు పరిష్కరించుకోవడానికి మంచి సమయం. కష్టపడి పని చేస్తే ఈ సమయంలో అన్ని మంచి ఫలితాలే వస్తాయి. జీవితంలో ఈ సమయంలో మంచి మార్పులు ఉండే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
జూలై 18వ తేదీ నుండి బుధుడు తిరోగమన సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఆర్థికంగా ధనుస్సు రాశి వారు లాభపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఈ సమయం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ప్రేమ జీవితంలో ఉండే ఇబ్బందులు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవచ్చు. కెరీర్ లో ఉండే ఒడిదుడుకులు పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం. ధనుస్సు రాశి వారి ఎదుగుదలకు ఈ సమయం దోహదం చేస్తుంది.

కుంభరాశి
జూలై 18వ తేదీ నుంచి బుధుడి తిరోగమన సంచారం కారణంగా కుంభరాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారి జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉన్న కారణంగా కాస్త ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి. అయినప్పటికీ ఈ సమయం కుంభ రాశి వారికి మంచి సమయం.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+