అక్టోబర్ 10వరకు వీరికి రాజభోగాలను, ఐశ్వర్యాన్ని ప్రకటించిన బుధుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలలో ముఖ్య గ్రహంగా భావించే బుధుడు సెప్టెంబర్ 23వ తేదీన భాద్రపద కృష్ణపక్ష షష్టి తిధి రోజు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు కన్య రాశిలోకి ప్రవేశించాడు. అక్టోబర్ పదవ తేదీ వరకు బుధుడు కన్యారాశిలోనే కొనసాగుతాడు. మళ్ళీ అక్టోబర్ 10వ తేదీన ఉదయం 11గంటల 25 నిమిషాలకు గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు కన్యారాశి నుండి బయటకు వెళ్లి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు.

కన్యారాశిలో బుధ సంచారం
కన్యారాశిలో బుధ సంచారం కొన్ని రాశుల వారికి సంతోషకర వాతావరణాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది. కొన్ని రాశుల వారికి ఎప్పటినుంచో తీరని కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. బుధ గ్రహం ప్రత్యేక అనుగ్రహం కారణంగా సానుకూల ఫలితాలు పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

Mercury gives royal life and wealth to these zodiac signs until October 10th

మిధున రాశి
బుధ గ్రహ సంచారం మిధున రాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో వినోద రంగానికి సంబంధించిన వ్యక్తులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. డబ్బు సంపాదించడానికి ఇది సరైన సమయం. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మిధున రాశి జాతకుల మేధస్సు ఈ సమయంలో అభివృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితంతో ఇది సంతోషంగా గడిపే సమయం.

కన్యారాశి
బుధ గ్రహ సంచారం కారణంగా కన్యారాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. కన్యారాశి జాతకులు వర్ధక వ్యాపారాలలో విశేష లాభాలను పొందుతారు. పాత పెట్టుబడుల నుండి అపారమైన ప్రయోజనాలను పొందుతారు. వివాహితులు తమ కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. స్నేహితులతో వివాదాలు ఉంటే అవి సమసిపోతాయి. ఈ సమయం నిజంగా కన్యా రాశి వారికి అదృష్ట సమయం.

తులారాశి
బుధ సంచారం కారణంగా తులా రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు. స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం.

కుంభరాశి
కుంభరాశి వారికి బుధ సంచారం శుభప్రదంగా ఉంటుంది. కుంభ రాశి వారికి ఈ సమయంలో వివిధ మార్గాల నుండి ఆదాయం లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు విజయాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం . కెరీర్ లో మీకు ఉన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య బాధలు తగ్గుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+