ఫిబ్రవరిలో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతారని చెప్పిన బుధుడు!

జ్యోతిష్య శాస్త్రం అన్ని రాశులవారి జీవితాలను నిర్దేశిస్తుంది. గ్రహాల రాకుమారుడు అయిన బుధుడికి వేద జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో బుధుడు రెండుసార్లు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఇక బుధ సంచారం ప్రభావం అన్ని రాశుల వారి పైన కనిపిస్తుంది.

కుంభరాశిలో బుధ సంచారం
మేధస్సుకు, వ్యాపారాలకు, కమ్యూనికేషన్ కు ప్రతినిధి అయిన బుధుడు ఫిబ్రవరిలో కుంభరాశిలో రెండుసార్లు స్థాన మార్పు చెంది పలు రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తున్నాడు.కొన్ని రాశులవారికి బుధ సంచారం కారణంగా సంపన్న యోగం కలుగుతుంది. ఇక కుంభరాశిలో బుధుడు రాశి చక్ర పరివర్తన కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

mercury in aquarius in feberuary these are the lucky and wealthy zodiac signs

మేష రాశి
మేషరాశిలో 11వ గృహంలో బుధుడు స్థాన చలనం చెందుతున్నాడు. దీని కారణంగా మేషరాశి జాతకులకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. మేషరాశి వారి ఈ సమయంలో వివిధ రంగాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి జీవితంలోను, వ్యక్తిగత జీవితంలోను సానుకూల మార్పులను చూస్తారు. అంతే కాదు గొప్ప విజయాలను కూడా అందుకుంటారు. బుధుడి స్థాన మార్పు కారణంగా ఈ రాశి వారికి డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మిధున రాశి
బుధ సంచారం కారణంగా మిధున రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మిధున రాశిలో 9వ స్థానంలో బుధుడు స్థానచలనం చెందుతూ ఉండడం వల్ల ఈ రాశి వారు జీవితంలో సంతోషాన్ని పొందుతారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది.. విదేశీ పర్యటనలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో గొప్ప విజయాలను సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

సింహరాశి
బుధ సంచారం కారణంగా సింహ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సింహరాశి జాతకులు లబ్ధిని పొందుతారు. బుధుడు సింహరాశిలో ఏడవ స్థానంలో సంచరించడం వల్ల వీరికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా లాభం పొందుతారు. డబ్బు విషయంలో పొదుపుకు ఆస్కారం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+