భరణి నక్షత్రంలోకి బుధుడు.. ఈ రాశులవారికి ధననష్టాలు, అడుగడుగునా కష్టాలు, మీరున్నారా?

గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారినప్పుడల్లా అన్ని రాశులవారి జీవితాలపైన సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. అంతే కాదు గ్రహాల నక్షత్ర గమనం కూడా ద్వాదశ రాశులవారి జీవితాలపైన విశేషమైన ప్రభావాలను చూపిస్తుంది. మే నెలలో 21వ తేదీన బుధగ్రహం భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. భరణి నక్షత్రంలో బుధగోచారం ముఖ్యంగా ఏడు రాశులవారికి తీవ్రమైన నష్టాలను కష్టాలను కలిగిస్తుంది. ఇక ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి వారికి బుధ గ్రహం నక్షత్ర మార్పు హాని కలిగిస్తుంది. కొత్త వ్యక్తులతో వాదులాటాలకు దిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది. చిన్న విషయానికి కూడా కోర్టుకు వెళ్లవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్త.

Mercury in Bharani Nakshatra Financial losses and difficulties for these zodiac signs

సింహరాశి
బుధ గ్రహ నక్షత్ర మార్పు సింహరాశి జాతకులకు అనవసరపు ఇబ్బందులను తెస్తుంది. ఈ సమయంలో పొరపాటున కూడా ఎలాంటి ఆస్తులలోనూ, వ్యాపారాలలోనూ డబ్బులు పెట్టుబడి పెట్టకూడదు. అనవసరమైన విషయాల పట్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోకపోతే భవిష్యత్తులో డబ్బుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

తులారాశి
తులా రాశి జాతకులకు అనారోగ్య సమస్యలు కలవరపెడతాయి. అనవసరమైన చోట్ల మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. నలుగురిలో నవ్వుల పాలయ్యే పరిస్థితులు వస్తాయి. కొత్త వ్యాపారాలలో ప్రవేశించేవారు నష్టాలను చూస్తారు.

మీనరాశి
మీన రాశి వారు ఈ సమయంలో కోపాన్ని అదుపులోకి పెట్టుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. భర్తతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా నష్టపోతారు. భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది.

కన్యారాశి
బుధ గ్రహం భరణి నక్షత్రంలోకి మార్పు వల్ల కన్య రాశి జాతకుల ఇంట్లో సమస్యలు పెరుగుతాయి ఉద్యోగంలో కష్టపడి పనిచేసిన ఫలితం రాదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు బుధ గ్రహం భరణి నక్షత్రంలోకి మార్పు వల్ల అనారోగ్యాల బారిన పడతారు. కీళ్ల నొప్పుల సమస్య ఉండవచ్చు. పని చేసే వ్యక్తులు తమ యజమానితో గొడవలకు దిగుతారు. వ్యాపారంలో కూడా నష్టం రావచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు పెరగవచ్చు.

మకర రాశి
బుధ గ్రహం భరణి నక్షత్రం లోకి ప్రవేశించడం వల్ల మకర రాశి జాతకులు ఇబ్బందులు పడవచ్చు. ధన నష్టం జరగవచ్చు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావచ్చు. మిత్రులతో గొడవలు పెరగవచ్చు. అనారోగ్యం బారిన పడవచ్చు. ఆసుపత్రుల పాలు కావొచ్చు జాగ్రత్త. .

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+