ఎప్పుడూ చేయని అద్భుతాలు చేస్తూ జనవరి 4వరకు వీరికి కాసులవర్షం కురిపిస్తున్న బుధుడు!

నవగ్రహాల్లో బుధ గ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహం. అక్టోబర్ 31వ తేదీన బుధ గ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశించింది. ఇక వృశ్చిక రాశిలోనే జనవరి 4వ తేదీ వరకు బుధ గ్రహం కొనసాగుతుంది. సాధారణంగా ఏ రాశిలో అయినా మూడు వారాలకు మించి బుధుడు సంచరించడు కానీ ఈసారి వృశ్చిక రాశిలో ఏకంగా 64రోజుల పాటు బుధ సంచారం జరుగుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది.

వృషభరాశి
వృషభ రాశి వారికి బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంతేకాదు బుధుడిని గురు, శని గ్రహాలు పూర్ణ దృష్టితో చూస్తున్నారు. దీంతో జనవరి 4వ తేదీలోపు ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి.. వివాహ సంబంధాలు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

Mercury is giving wealth to these zodiac signs until January 4 doing miracles in scorpio

కర్కాటక రాశి
కర్కాటక రాశిలో పంచమ స్థానంలో బుధుడు సంచరించడం కారణంగా కర్కాటక రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి గృహ సంబంధిత విషయాలలో సమస్యలు తొలగిపోయి వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉద్యోగ జీవితం సంతోషంగా సాగుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది.

సింహరాశి
సింహ రాశి వారికి నాలుగో స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఇక సింహరాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. నూతన గృహాలు కొనుగోలు చేసి, గృహప్రవేశాలు చేసే అవకాశం ఉంది. ఆస్తుల సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలోనే బుధుడు సంచరిస్తున్న కారణంగా వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ఉన్నత స్థానానికి వెళ్తారు. అంతేకాదు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్దికంగా ఈ సమయం కలిసి వస్తుంది.

మకర రాశి
మకర రాశి వారికి బుధుడు లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీంతో మకర రాశి వారికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఉద్యోగం చేసే వారికి ఉన్నత పదవులు దొరుకుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇది మకర రాశి వారికి అదృష్ట సమయం

కుంభరాశి
కుంభ రాశి వారికి బుధుడు ఉద్యోగ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీంతో కుంభరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అవకాశం ఉంది. ఈ సమయంలో కుంభ రాశి జాతకులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+