దసరా తర్వాత వీరికి కుబేరయోగం ప్రకటించిన బుధుడి నక్షత్ర సంచారం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశత రాశిలో సంచారం చేస్తుంటాయి. గ్రహాలు రాశులు మాత్రమే కాకుండా నక్షత్రాలలో కూడా సంచరిస్తాయి. జ్యోతిష శాస్త్రంలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది . బుధుడిని జ్ఞానానికి, కమ్యూనికేషన్ కు ప్రతీకగా భావిస్తారు. మరో ఐదు రోజులలో అక్టోబర్ 14 వ తేదీన బుధుడు స్వాతి నక్షత్రంలో సంచారం చేయనున్నాడు.

స్వాతి నక్షత్రంలోకి బుధుడు
స్వాతి నక్షత్రం రాహువుకు చెందిన నక్షత్రం కావటంతో కొన్ని రాశులవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మూడు రాశుల వారి అదృష్టం మారబోతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గోచారానికి విశేషమైన ప్రాధాన్యత, మహత్యం ఉంటుంది. గ్రహాల గోచారం మన జాతకాలను నిర్ణయిస్తుంది. కాబట్టి గ్రహాల రాశుల గోచారం, నక్షత్ర గోచారం దేనికవే ప్రధానమైనవి. బుధుడు నక్షత్ర గోచారం కారణంగా అదృష్టవంతులుగా మారుతున్న రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Mercury nakshatra transit announced Akhanda Dhanayoga for these zodiac signs after dussehra

కన్యారాశి
బుధుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించటం వలన కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అక్టోబర్ 14వ తేదీ నుండి ఈ రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఊహించని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో వీరి జీవితం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. నూతన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మిధున రాశి
బుధుడు స్వాతి నక్షత్రం లోకి ప్రవేశించడం వల్ల మిధున రాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు. ఈ సమయంలో మిధున రాశి వారికి ఆర్థిక ధన లాభం కలుగుతుంది. అక్టోబర్ 14 నుండి వీరి జాతకమే మారబోతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక లాభాలను పొందుతారు. చాలా కాలంగా రాని మొండి బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కుంభరాశి
కుంభ రాశి వారికి అక్టోబర్ 14 నుండి అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఇది మంచి కాలం. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+