ఫిబ్రవరిలో బుధుడు, రాహువు కలిసి వీరిని కింగ్స్ చేస్తున్నారు

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు కాలనుగుణంగా సంచారం చేస్తూ, ఇతర గ్రహాలతో సంయోగం చెందుతూ అనేక శుభ యోగాలను, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఫిబ్రవరి మాసంలో బుధుడు మరియు రాహువు కలయిక జరగబోతోంది. బుధుడిని తెలివితేటలకు, తర్కానికి, కమ్యూనికేషన్ కి కారకుడిగా చెబుతారు.

రాహువు, బుధుల సంయోగం
రాహువును దొంగతనం, చెడు పనులు, కఠినమైన మాటలు, జూదం వంటి వాటికి కారకుడిగా చెబుతారు. బుధ రాహువులు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంయోగం చెందబోతున్నాయి. దీని ఫలితంగా కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mercury Rahu Conjunction in Aquarius After 18 Years These Zodiac Signs Will Be Lucky

మేషరాశి
రాహువు మరియు బుధుల సంయోగం మేషరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సంయోగం మీ సంచార చార్ట్ లోని 11వ గృహంలో జరగడం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ సమయంలో మీ విశ్వాసం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ మరియు లాటరీల నుంచి ప్రయోజనాలను పొందవచ్చు.

మిధున రాశి
బుధుడు మరియు రాహువు యొక్క కలయిక మిధున రాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. బుధుడు మరియు రాహువుల కలయిక మిధున రాశిలో 9వ గృహంలో ఏర్పడుతుంది.ఈ సమయంలో మిధున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. విదేశీ యానం చేసే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఈ కలయిక భాగస్వామ్య వ్యాపారాలలో ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి . శుభకార్యాలలో పాల్గొంటారు.

కుంభరాశి
బుధుడు మరియు రాహు యొక్క కలయిక ఫిబ్రవరి నెలలో కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుంభరాశిలో లగ్న గృహంలో ఈ కలయిక ఏర్పడడం వల్ల ఇది కుంభ రాశి జాతకులకు మేలు చేస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు నాయకత్వ పాత్రను పోషిస్తారు. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సామాజిక సహకారం లభిస్తుంది. వివాహితులకు అద్భుతమైన వైవాహిక జీవితం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+