బుధ తిరోగమనం.. మరో 46 రోజుల్లో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఆగస్టు నెలలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశుల వారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఆగస్టు నెలలో బుధుడు తిరోగమన దిశలో ప్రయాణం చేస్తాడు. దీని ప్రభావంతో ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులేమిటి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

తిరోగమనంలో బుధుడు
బుధుడు ప్రస్తుతం మిధునరాశిలో సంచరిస్తున్నాడు. మిధునరాశిలో జూన్ నెలలోనే రెండుసార్లు తన కదలికలను మార్చుకుంటున్న బుధుడు జూన్ 29వ తేదీన కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం సవ్య దిశలోనే ప్రయాణం చేస్తున్న బుధుడు ఆగస్టు నెలలో తిరోగమన దిశలో ప్రయాణం చేస్తాడు. ఇక ఆగస్టు 5వ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 28వ తేదీ వరకు తిరోగమనంలోనే సంచరిస్తాడు బుధ తిరోగమన సంచారం కారణంగా మూడు రాశులవారికి లబ్ది జరుగుతుంది.

Mercury retrograde In another 46days these zodiac signs will get golden life

ధనస్సు రాశి
బుధుని తిరోగమనం ధనుస్సు రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబంతో సరదాగా ఉంటారు. ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో ప్రశాంతంగా ఉంటారు. మంచి ఫలితాలకు అవకాశం ఉంది.

సింహరాశి
బుధ తిరోగమనం సింహరాశిలోనే జరుగుతుంది. దీంతో సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది అనుకూలమైన సమయం. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఈ సమయంలో మెండుగా ఉన్నాయి. ఇక కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఈ సమయంలో మీరు మంచి ఉద్యోగ అవకాశాలను కూడా పొందవచ్చు.

కర్కాటక రాశి
బుధ తిరోగమన సంచారం కర్కాటక రాశి వారికి లబ్ధి చేకూరుస్తుంది. కర్కాటక రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. కర్కాటక రాశి జాతకుల జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకుల పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు. ఆరోగ్యం బాగుంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+