నవంబర్ లో ఈ రాశులవారికి తీవ్ర హెచ్చరిక జారీ చేసిన బుధ తిరోగమనం
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ,గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక నవంబర్ మాసంలో ముఖ్య గ్రహాల కదలికల కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. నవంబర్ మాసంలో బుధుడు తిరోగమనంలో సంచరిస్తాడు.
బుధుడి తిరోగమన సంచారం
నవంబర్ 10వ తేదీన గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు తిరోగమన సంచారాన్ని మొదలుపెడతాడు. దీనివల్ల అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారు నవంబర్ మాసంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నవంబర్లో మేష రాశి వారు కుటుంబ సభ్యులతో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అపార్ధాలు చోటు చేసుకునే పరిస్థితి ఉంది. పాత స్నేహితులను కలవడం వల్ల కొంతమేర ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉన్నప్పటికీ నవంబర్ మాసంలో మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు నవంబర్ మాసంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. నిద్ర లేకపోవడం, అలసట వంటి కారణాలతో ఊహించని ఆరోగ్య సమస్యలు వస్తాయి .ఇక ప్రతిరోజు శివాభిషేకం చేయించడం వల్ల కర్కాటక రాశి జాతకులకు కాస్త ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక ఆర్థిక విషయాలలో అయితే ఈ సమయం బాగానే ఉంటుంది.
తులారాశి
నవంబర్ మాసంలో తులా రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో విదేశాలకు ప్రయాణాలు చేసే వారు అడ్డంకులను లేదా చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తులా రాశి వారు బుధ గ్రహ తిరోగమనం కారణంగా వచ్చే ఇబ్బందుల నుండి బయటపడటానికి తులసి మొక్క దగ్గర దీపం పెడితే మంచిది.
వృశ్చిక రాశి
నవంబర్ మాసంలో బుధుడు తిరోగమనం కారణంగా వృశ్చిక రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కొత్త వ్యక్తులను నమ్మకూడదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎవరినైనా నమ్మితే మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి వృశ్చిక రాశి జాతకులు ఆవుకు ఆహారం తినిపిస్తే మంచిది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications