ఆగస్టు 28 నుండి ఈ రాశులవారికి వరాలను ప్రకటిస్తున్న బుధుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. అలాగే ప్రతి గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. నవగ్రహాలలో బుధుడు తెలివితేటలు,జ్ఞానం మరియు కమ్యూనికేషన్ కు ప్రత్యేకంగా నిలిచే గ్రహం. ఆగస్టు 5వ తేదీన బుధుడు సింహరాశిలో అస్తమించాడు. అదే సమయంలో ఈ రోజు నుంచే తిరోగమన దిశలోకి వెళుతున్న బుధుడు ఆగస్టు 29 వరకు తిరోగమన స్థితిలోనే ఉంటాడు.
బుధుడి ఉదయం... అదృష్ట రాశులు
ఆపై ఆగస్టు 28వ తేదీన బుధవారం తెల్లవారుజామున 4 గంటల 57 నిమిషాలకు కర్కాటక రాశిలో తిరోగమన దిశలోనే ఉన్న బుధుడు ఉదయిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. కొన్ని రాశులవారికి బుధోదయం సంపదలను ఇస్తుంది. బుధుడి ఉదయం లబ్ధిని చేకూర్చే రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మిధున రాశి
బుధుడు ఉదయించడం వల్ల మిధున రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో వీరి మాటలలో సౌమ్యత కనిపిస్తుంది. మిధున రాశి వారు ఈ సమయంలో ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఉన్నాయి. మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది .సంపదలో పెరుగుదల ఉంటుంది.
తులారాశి
బుధుడు ఉదయించడం వల్ల తులా రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. తులా రాశి వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఆర్థిక పురోగతికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి.
మకర రాశి
బుధుడు ఉదయించడం మకర రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మకర రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మకర రాశి జాతకులు న్యాయపరమైన వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. పూర్వీకుల ఆస్తి ద్వారా మకర రాశి వారికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. కెరీర్లో గొప్ప విజయాలను సాధిస్తారు. మకర రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications