త్వరలో ఉదయిస్తూనే వీరిని మహర్జాతకులుగా మారుస్తానని మాటిచ్చిన బుధుడు!

వేద జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. డిసెంబర్ 11వ తేదీన రాత్రి 7:44కి వృశ్చికరాశిలో బుధుడి ఉదయం జరుగుతుంది. కమ్యూనికేషన్ కు, శక్తికి ప్రతినిధిగా నిలిచే బుధుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి బుధుడు వృశ్చిక రాశిలో ఉదయిస్తున్న కారణంగా కొన్ని రాశులవారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వారు బుధుడి దయతో అదృష్ట జాతకులుగా మారుతున్నారు ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఏడవ ఇంట్లో బుధుడు ఉదయిస్తున్నాడు. బుధుడు వృషభ రాశి వారి రెండవ మరియు ఐదవ ఇంటికి అధిపతి. అయితే ఏడవ ఇంట్లో బుధుడి ఉదయం కారణంగా వృషభ రాశి వారికి అనుకూలమైన ప్రయోజనాలు వస్తాయి. వ్యాపారులకు సంబంధించి లాభాలు వస్తాయి. నూతన వాణిజ్య పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. ఇది పొదుపు చేయడానికి కూడా సరైన సమయం.

Mercury rise in scorpio brings these zodiac signs a great life and wealth

సింహరాశి
సింహరాశిలో నాలుగవ ఇంట్లో బుధుడు ఉదయిస్తాడు. బుధుడు సింహరాశి వారి రెండవ, 11 వ గృహాలకు అధిపతి. డిసెంబర్ 11వ తేదీన బుధుడు ఉదయించడం కారణంగా సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. ఆర్థిక సానుకూలత కలుగుతుంది. కెరీర్ కు సంబంధించి కూడా విజయాలను పొందుతారు. వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఇది ఆర్థికంగా సింహ రాశి వారికి కలిసి వచ్చే కాలం.

కన్యారాశి
కన్యా రాశి వారికి బుధుడు మూడవ ఇంట్లో ఉదయిస్తాడు. కన్య రాశిలో ఒకటవ మరియు 10వ గృహాలకు బుధుడు అధిపతి. ఇక బుధుడు తాజా పరిణామం కారణంగా కన్యారాశి జాతకులకు వ్యక్తిగత వృద్ది కొనసాగుతుంది. కెరీర్ కి సంబంధించి సానుకూల ఫలితాలు వస్తాయి. విదేశాలలో పనిచేసే అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపార లాభాలలో పెరుగుదల వస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

తులారాశి
తుల రాశి వారి తొమ్మిదవ మరియు 12వ గృహాలకు బుధుడు అధిపతి . ఇక తులా రాశిలో బుధుడు రెండవ ఇంట్లో ఉదయిస్తున్నాడు. ఫలితంగా వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా తులా రాశి జాతకులు విజయాలను సాధిస్తారు. ఆర్థికపరంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఇది తులా రాశి వారికి అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+