ధన త్రయోదశి నుండి వీరికి డబ్బుల మూటలను పంపుతున్న బుధుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అక్టోబర్ 29వ తేదీన గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేయనున్నాడు. బుధుడు ఒక వ్యక్తి యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని సూచించే గ్రహం. ఈ నెలలో బుధుడు రెండు సార్లు రాశిని మార్చుకుంటున్నాడు.
బుధ సంచారం
అక్టోబర్ 10న బుధుడు తులారాశిలోకి సంచారం చేశాడు. ఇప్పుడు అక్టోబర్ 29న బుధుడు వృశ్చిక రాశిలోకి సంచరిస్తున్నాడు. అటువంటి బుధ సంచారం కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తుండగా మరికొన్ని రాశుల వారికి అశుభసంకేతాలను ఇస్తున్నాయి. అక్టోబర్ 29వ తేదీన బుధ సంచారం, ఇదే రోజు ధన త్రయోదశి కూడా రానుంది.ఈ కారణంగా లబ్దిని పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభరాశి
వృషభ రాశిలో బుధుడు రెండవ మరియు ఐదవ గృహాలను పాలిస్తాడు. వృశ్చిక రాశిలో బుధ సంచారం సమయంలో ఆయన వృషభ రాశిలో ఏడవ ఇంట్లో సంచరిస్తాడు. ఇక ఇది వృషభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కోరుకున్న వారితో వివాహాలు జరగడానికి ఇది సరైన సమయం. ఇది వాణిజ్య భాగస్వామ్యాలలోనూ శుభ ఫలితాలను ఇస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారికి బుధుడు రెండవ మరియు 11వ గృహాలను పాలిస్తాడు. అయితే వృశ్చిక రాశిలో బుధ సంచారం సమయంలో సింహరాశిలో నాలుగవ ఇంట్లో బుధుడు ఉంటాడు. దీనివల్ల తల్లిదండ్రుల నుండి ఆస్తులు కలిసి వస్తాయి. ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో సింహ రాశి వారి కెరీర్ చాలా బాగుంటుంది.
మకర రాశి
మకర రాశిలో బుధుడు ఆరవ మరియు తొమ్మిదవ ఇంటిని పాలిస్తాడు. అయితే వృశ్చిక రాశిలో బుధ సంచారం సమయంలో మకర రాశిలో బుధుడు 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది మకర రాశిలో ఉన్న విద్యార్థులకు శుభ సమయం. కొత్త వ్యాపార వెంచర్లు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి జీవితంలో ఆశించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మకర రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications